తెలంగాణ

నేను ధర్మరాజును!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 6: ‘అసెంబ్లీలో నాది ధర్మరాజు పాత్ర, భీముని పాత్రను మా ఎమ్మెల్యేల్లో అవసరాన్ని బట్టి మారుతుంటారు..’ అని సిఎల్‌పి నేత, ప్రతిపక్ష నాయకుడు కె. జానారెడ్డి అన్నారు. శుక్రవారం జానారెడ్డి కొంత సేపు ఉల్లాసంగా, హుషారుగా గంటకు పైగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ నవ్వించారు. మీకు నెల రోజులకు సరిపోయేంత క్లాసు తీసుకున్నానని, మీ మైండ్‌లు ఇప్పుడు రీప్రెష్ అయ్యాయని మరోసారి నవ్వించారు. అసెంబ్లీలో తనది ధర్మరాజు పాత్ర అని అయితే ప్రతి సారీ తనను అశ్వత్థామ హతఃకుంజరా అని మాత్రం అనాలని కోరుకోకూడదని ఆయన నవ్వుతూ చెప్పడంతో విలేఖరులు నవ్వాపుకోలేకపోయారు. ఇలా ఆయన కొంత సేపు నవ్వించారు. తమ పార్టీ వల్లే సభ హుందాగా సాగుతున్నదని, తమ పార్టీ ఎమ్మెల్యేలు సంయనం పాటిస్తున్నారని ఆయన చెప్పారు. అధికార పక్షం పని తీరు ఎలా ఉందని ప్రశ్నించగా, రోజూ చూస్తున్నారు కాబట్టి మీరే చెప్పాలని ఆయన దాట వేశారు. మెల్లగా వెళితే దూకుడుగా వెళ్ళడం లేదని అంటారని, దూకుడుగా వెళితే అధికారం దక్కలేదన్న అక్కసుతో చేస్తున్నారని అంటారని జానారెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తాము అధికారంలోకి వస్తే ఎలా నడుచుకోవాలని అనుకున్నామో, ఇప్పుడూ అలాగే హుందాగా వ్యవహారిస్తున్నామని అన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా తమ బాధ్యతను నిర్వహిస్తున్నామని, ప్రతి అంశంలోనూ సునిశిత విమర్శలు చేస్తున్నామని అయితే మీరే దానిని సరైన విధంగా ఫోకస్ చేయడం లేదని సుతిమెత్తగా అన్నారు. కొన్ని అంశాలను తాను ఉద్దేశ్యపూర్వకంగా విమర్శించడం లేదని ఉదయ్ పథకం గురించి ఉదహరించారు. ఈ ఉదయ్‌లో రాష్ట్ర ప్రభుత్వం చేరిందని, దీనిపై సందర్భోచితంగా మాట్లాడుతానని అన్నారు. సిఎల్‌పి నేతను మార్చుకునే అంశంపై అసెంబ్లీలో మంత్రి టి. హరీశ్‌రావు వ్యాఖ్యానించినప్పుడు తమ పార్టీ ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క వెంటనే సమాధానమిచ్చి ఉండాల్సిందని ఆయన తెలిపారు. ముస్లిం రిజర్వేషన్ల అమలు విషయంలో తాను మొదటి నుంచి చెబుతున్నదే ప్రభుత్వం చేస్తుందని అన్నారు. కేంద్రంపై నెట్టి వేస్తుందని ఆయన తెలిపారు. టిఆర్‌ఎస్ అధికారం చేపట్టిన తర్వాత కొత్తగా ఏ ఒక్క పథకాన్నీ చేపట్టలేదని, గతంలో తాము చేసిన వాటినే అమలు చేస్తున్నదని అన్నారు. భూ సేకరణ కోసం ప్రభుత్వం తెచ్చిన జివోతో లోగడ యుపిఎ చేసిన చట్టం కంటే ఎక్కువ మొత్తంలో పరిహారం చెల్లించాలనుకుంటే వద్దనే వారు ఎవరూ ఉండరని ఆయన తెలిపారు. తనను పెద్దలు జానారెడ్డి అని సంబోధించడానికి తనకు అర్హత ఉందని అన్నారు. అలా లేనట్లయితే అభ్యంతరం చెప్పి ఉండేవాన్ని అని ఆయన చెప్పారు. 16 ఏళ్ళు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించానని ఆయన తెలిపారు. తన పక్కనే ఉన్న ఎమ్మెల్యే టి. జీవన్‌రెడ్డిని చూపిస్తూ తాము ఇద్దరమూ 1983లో ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఉన్నామని జానారెడ్డి చెప్పారు.