తెలంగాణ

మానవీయ కోణంలో మెస్ చార్జీలు పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 6: విద్యార్ధులకు హాస్టల్ మెస్ ఛార్జీలను మానవీయ కోణంతో ఆలోచించి పెంచాలని శుక్రవారం నాడు శాసనసభలో విపక్షాలు కోరాయి. టిడిపి నేత రాగ్యా కృష్ణయ్య, బిజెపి నేత జి కిషన్‌రెడ్డి, కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి, ఎస్‌ఎ సంపత్‌కుమార్ తదితరులు మెస్ చార్జీలు పెంచాలని కోరారు. సంక్షేమ శాఖా మంత్రి జగదీష్‌రెడ్డి బదులిస్తూ కాలేజీలు, స్కూళ్లకు చెందిన సంక్షేమ హాస్టళ్లలో విద్యార్ధులకు మెస్ చార్జీలను పెంచే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని పేర్కొన్నారు. ఒక్క రూపాయికే సబ్సిడీ రేటున సన్నబియ్యం సరఫరా చేయడం, సంబంధిత పాఠశాలల్లోని హాస్టల్ విద్యార్ధులు అందరికీ మధ్యాహ్న భోజనం సమకూర్చడం ద్వారా పెరిగిన జీవన వ్యయానికి తగినంత పరిహారాన్ని సమకూర్చడమైందని అన్నారు. సంత భవనాలు ఉన్న సంక్షేమ హాస్టళ్ల జిల్లా వారీ వివరాలు సభాసమక్షంలో ఉంచడమైందని, గత రెండు సంవత్సరాల్లో 76 సంక్షేమ హాస్టళ్ల భవనాలను నిర్మించడమైందని అన్నారు. కాలేజీలకు వెళ్లే విద్యార్ధుల కోసం శాఖాపరమైన అనుబంధ హాస్టళ్లకు సంబంధించి జిల్లా కొనుగోలు కమిటీ ద్వారా ఐదేళ్ల మన్నిక ఉన్న బెడ్ ఒక్కంటికీ 8వేల రూపాయిలు చొప్పున బంకర్ బెడ్‌ల కొనుగోలు కోసం జీవో 49 జారీ చేశామని పేర్కొన్నారు. ఇప్పటికైతే కంప్యూటర్ల సరఫరాకు ఎలాంటి ప్రతిపాదన లేదని మంత్రి చెప్పారు. బంకర్ బెడ్‌ల సేకరణ కోసం జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి అధికారులు అందరికీ ఆదేశాలు జారీ చేశామని అన్నారు. అంతకుముందు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ పూటకు 8.33 రూపాయిలు ఇస్తున్నారని దాంతో ఏం భోజనం వస్తుందని ప్రశ్నించారు. హాస్టళ్లు చాలా చోట్ల శిథిలావస్థకు చేరుకున్నాయని, అధ్వన్నంగా ఉన్నాయని, వార్డెన్లు లేక వర్కర్లు లేక బెడ్‌లు లేక తాగునీరు లేక, చివరికి టాయిలెట్లు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఉత్సవాల రోజున ఒక్క రూపాయి అదనంగా ఇచ్చి స్పెషల్ భోజనం చేయమంటున్నారని ఒక్క రూపాయితో స్పెషల్ భోజనం ఎలా వస్తుందని ప్రశ్నించారు. చర్చలో పాల్గొన్న చిన్నారెడ్డి వనపర్తిలో హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని కోరగా, కిషన్‌రెడ్డి కాచిగూడ హాస్టల్‌ను అభివృద్ధి చేయాలని కోరారు. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కొత్త బిసి హాస్టళ్లను సొంత భవనాల్లోనే నిర్మించాలని అన్నారు. ఆలంపూర్ సంపత్‌కుమార్ మాట్లాడుతూ బెడ్‌లు ఇంత వరకూ ఏర్పాటు కాలేదన్నారు.