తెలంగాణ

ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతులిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 6: రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతి ఇవ్వనున్నట్టు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. అసెంబ్లీ లాబీలో శుక్రవారం కడియం శ్రీహరి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాల నియమ నిబంధనలు ఎలా ఉండాలి అనే ఆలోచిస్తున్నామని, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు రావడం మాత్రం ఖాయం అని అన్నారు. దేశ వ్యాప్తంగా 254 ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఉన్నాయని చెప్పారు. తమిళనాడు, గోవా, జమ్మూ కాశ్మీర్, తెలంగాణ వంటి ఆరు రాష్ట్రాల్లో మినహా దేశమంతటా ఇప్పటికే ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇచ్చారని చెప్పారు. అయితే ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతి ఇవ్వడంలో ఒక్కో రాష్ట్రం ఒక్కో విధానం అమలు చేస్తోందని చెప్పారు. కేరళలో 25శాతం సీట్లు స్థానికులకు కేటాయించి మిగిలిన సీట్లు యూనివర్సిటీ ఇష్టానికి వదిలేశారని, అదే విధంగా కొన్ని రాష్ట్రాలు వీటిలో రిజర్వేషన్లను అమలు చేయాలనే నిబంధన విధించినట్టు చెప్పారు. మన రాష్ట్ర విద్యార్థులకు ప్రయోజనం కలిగే విధంగా నిబంధనలు ఉంటాయన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల టీచర్ల నియామకంలో కొంత ఆలస్యం అవుతోందని శ్రీహరి తెలిపారు.
కడియం-జానా చమత్కారాలు
కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడుండగానే ప్రతిపక్షనాయకుడు జానారెడ్డి అటు వైపు రావడంతో కడియం పలకరించారు. ఎంత సేపు మాట్లాడినా కడియం ఏమీ చెప్పరు అన్నట్టుగా విలేఖరులతో జానారెడ్డి ఏదో అన్నారు. టిడిపిలో రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఇలానే మీడియాతో గంటల తరబడి మాట్లాడినా ఏమీ చెప్పరని కడియం గుర్తు చేశారు.