తెలంగాణ

36 లక్షల మందికి ‘ఆసరా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 6: తెలంగాణ రాష్ట్రంలో 35,92,134 మందికి ఆసరా పథకం కింద పించన్లు అందిస్తున్నామని పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. వృద్ధులు సంతకాలు చేయలేకపోతే ఐరిస్‌ను సేకరించి వారికి పెన్షన్ చెల్లిస్తామని అన్నారు. శాసనసభలో ఆరూరి రమేష్ తదితరులు అడిగిన ప్రశ్నలకు శుక్రవారం నాడు మంత్రి జూపల్లి సమాధానం చెబుతూ ఆసరా పథకాన్ని ప్రారంభించిన నాటి నుండి 9651.39 కోట్లు ఖర్చు చేశామని అన్నారు. రాష్ట్రప్రభుత్వం అమలుచేస్తున్న అతిగొప్ప సంక్షేమ కార్యక్రమమని అన్నారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాలతో పాటు ఆత్మగౌరవం నిలపాలని సిఎం నిర్ణయించారని, మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు వారికి ఈ సంక్షేమ కార్యక్రమాన్ని అమలుచేస్తున్నామని మంత్రి జూపల్లి చెప్పారు. సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించినపుడు ఆసరా పెన్షన్లు కుదించేందుకేనని ఆనాడు ఆరోపణలు చేశారని, కాని ఆసరా పెన్షన్లు ఆ తర్వాత మరింత పెరిగాయని పేర్కొన్నారు. ఒంటరి స్ర్తిలు, జోగినులు, మాతంగలు, బసవస్ర్తిలకు సంబంధించి ప్రభుత్వం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఒకపుడు 75 రూపాయిలు చెల్లించేవారని, నేడు నెలకు 1500 రూపాయిలు పించనుగా చెల్లిస్తున్నామని మంత్రి జూపల్లి చెప్పారు. పెన్షన్లు సకాలంలో ఇస్తున్నామని, చెల్లింపులకు కూడా సమగ్ర విధానం అమలుచేస్తున్నామని పేర్కొన్నారు. బ్యాంకులు, పోస్ట్ఫాసులు ద్వారా ఇస్తున్నామని, పెద్ద పెద్ద రాష్టాల్లో కూడా ఇంత మందికి పెన్షన్లు ఇవ్వడం లేదని అన్నారు. మాన్యువల్‌గా 4.50 లక్షల మందికి పెన్షన్లు చెల్లించేవారని, ఆ సంఖ్యను నేడు 1.11 లక్షలకు తగ్గించామని అన్నారు. వీటిని కూడా పోస్ట్ఫాసులు లేదా బ్యాంకులు ద్వారా చెల్లిస్తామని అన్నారు. హైదరాబాద్ నగరంలో బ్యాంకు ఖాతాలు సేకరించి ఎటిఎంల ద్వారా చెల్లింపులు చేస్తామని చెప్పారు. ఈ చర్చలో ఎమ్మెల్యేలు వంశీచంద్, ప్రభాకర్, జాఫర్, బి శోభ, వెంకటవీరయ్య, రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డి, రామమోహనరెడ్డి తదితరులు పాల్గొన్నారు.