తెలంగాణ

మరో తిరుమలగా యాదాద్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, జనవరి 6:యాదాద్రి క్షేత్ర అభివృద్ధికోసం ప్రభుత్వం చేపట్టిన పనులు చురుకుగా కొనసాగుతున్నాయని, రాబోయే కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగా ఈ క్షేత్రం విలసిల్లుతుందని గవర్నర్ నరసింహన్ అన్నారు. శుక్రవారం ఉదయం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని గవర్నర్ దంపతులు దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైద్రాబాద్ నుండి యాదగిరిగుట్ట సమీపంలోని వడాయిగూడెంకు హెలికాప్టర్ ద్వారా ఉదయం 10.23గంటలకు చేరుకున్న నరసింహన్ దంపతులు 10.55 గంటలకు కొండపైన బాలాలయంలో స్వామివారిని దర్శించారు. అనంతరం ఆర్కిటెక్టు ఆనందసాయి బృందం రూపొందించిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను, ప్రధానాలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కొద్దిసేపు విలేకర్లతో నరసింహన్ మాట్లాడారు. 2.3 ఎకరాల విస్తీర్ణంలో యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులు చురుకుగా సాగుతున్నాయన్నారు. యాదాద్రి పుణ్యక్షేత్రం డిజిటలైజేషన్ సిటిగా రూపుదాలుస్తుందన్నారు. అంతకు ముందు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎన్.గీత, చైర్మన్ బి.నర్సింహమూర్తి, అర్చకులు గవర్నర్ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపి బూర నర్సయ్యగౌడ్, ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ గొంగిడి సునితా మహేందర్ రెడ్డి, వైటిడిఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, స్థపతి సుందరరాజన్, ఆనందచారి వేలు, గుట్ట జడ్ పిటిసి కర్రె కమలమ్మ వెంకటయ్య, ఎంపిపి గడ్డమిది స్వప్న రవీందర్ గౌడ్, గుట్ట సర్పంచి బూడిద స్వామి, ఎంపి టిసి వినోద్, మారెడ్డి కొండల్ రెడ్డి, కీసరి బాల్‌రాజ్, సుడుగు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

చిత్రం..గవర్నర్ దంపతులకు పూర్ణకుంభ స్వాగతం పలుకుతున్న అర్చకులు,