తెలంగాణ

సిఐ, డిఎస్పీల పదోన్నతులపై స్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 7: తెలంగాణలో సర్కిల్ ఇనెస్పెక్టర్లు, డిఎస్పీల పదోన్నతులపై హైకోర్టు స్టే విధించింది. అధికారుల పదోన్నతి కోసం గత ఏడాది డిసెంబర్ 13న పోలీసు శాఖ సీనియారిటీ జాబితాను రూపొందించింది. దీనిపై ఇంటెలిజెన్స్ విభాగంలో నాన్ క్యాడర్ ఎస్పీగా పనిచేస్తున్న పివి రాధాకృష్ణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ ఎంస్ రామచంద్రరావు విచారించారు. తెలంగాణ పోలీసు శాఖ ఖరారు చేసిన సీనియారిటీ లిస్టును సవరించాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. పోలీసు శాఖ ఏపి పోలీసు సర్వీసు రూల్స్‌ను రూపొందించిందని, వీటికి సంబంధించి 1966 నవంబర్ 8న నెంబర్ 2437 జీవోను విడుదల చేశారని, అయితే 2204లోనే న్యాయస్థానం ఈ రూల్స్‌ను కొట్టివేసిందన్నారు. ఒకసారి ఈ మార్గదర్శకాలను కొట్టివేసిన తర్వాత వాటి ఆధారంగా సీనియారిటీ లిస్టును తయారు చేశారన్నారు. దీనివల్ల డిఎస్పీ, అదనపు ఎస్పీ, ఎస్పీ (నాన్ క్యాడర్) సర్వీసుల్లో పనిచేస్తున్న పోలీసు అధికారుల పదోన్నతులపై ప్రభావం పడుతుందన్నారు. గత ఏడాది ప్రకటించిన సీనియారిటీ జాబితా విషయమై తనకు సమాచారం ఇవ్వలేదని ఆయన కోర్టుకు తెలిపారు. సీనియారిటీ జాబితాను రూపొందించిన విషయం పిటిషనర్‌కు తెలియచేయలేదని, ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని జస్టిస్ రామచంద్రరావు పేర్కొంటూ, ఎనిమిది వారాల పాటు జాబితాను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.