తెలంగాణ

ఆర్‌బిఐ ముసుగులో అధికార దుర్వినియోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 7: కేంద్ర ప్రభుత్వం ఆర్‌బిఐ ముసుగులో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి విమర్శించారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరగనున్న ఎన్నికల సందర్భంగా లబ్ది పొందేందుకు ఆ రాష్ట్రాలకు ఎక్కువ నగదును పంపిస్తున్నదని ఆయన శనివారం పార్టీ నాయకుడు జి. నిరంజన్‌తో కలిపి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ విమర్శించారు. రిజర్వు బ్యాంకును అడ్డు పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని ఆయన కేంద్రంపై విరుచుకుపడ్డారు. కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం (సిఇసి) జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ విషయమై తాను సిఇసికి లేఖ రాస్తున్నానని ఆయన చెప్పారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నిబంధనలను కొత్త నోట్ల సరఫరా అంశానికీ వర్తించేలా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఏ రాష్ట్రానికి ఎంత మొత్తంలో నోట్లు సరఫరా చేస్తున్నదో, ఏ ప్రాతిపదికన సరఫరా చేస్తున్నదో రిజర్వ్ బ్యాంకు ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. బ్యాంకులకు సరఫరా చేస్తున్న నోట్లను, నోట్ల ముద్రణకు సంబంధించి గణాంకాలు ఇవ్వాలని ఆర్‌టిఐ కింద ఒక వ్యక్తి కోరగా, భద్రతా కారణాల రీత్యా ఇవ్వలేమని రిజర్వు బ్యాంకు చెప్పడం సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు.