తెలంగాణ

మతిస్థిమితం లేని బాలికపై సామూహిక అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామడుగు, జనవరి 7: కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ మతిస్థిమితం లేని బాలికపై ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడడం, దానిని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించడం, ఆపై సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సోషల్ మీడియోలో ఒకరి ద్వారా ఒకరికి విస్తృత ప్రచారం జరగడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం...ఈ సం ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని తిర్మలాపూర్ గ్రామానికి చెందిన తడగొండ రాజయ్య (55), తడగొండ రాకేష్ (18), తడగొండ లక్ష్మణ్ (19) అనే ముగ్గురు కామాంధులు సుమా రు పదిహేను రోజుల క్రితం గోపాలరావుపేట గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని బాలిక (17)ను లాక్కెళ్లి గ్రామ శివారులో అత్యాచారం జరిపారు. ఇందులో రాజయ్య, రాకేష్ అత్యాచారం చేస్తుండగా, లక్ష్మణ్ వీడియో చిత్రీకరణ చేశాడు. తీసిన వీడియోను పలువురికి వాట్సప్‌లో పోస్ట్ చేశాడు. ఇలా ఒకరి ద్వారా ఒకరికి చేరటంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దీనిని గమనించిన బాధితు రాలి కుటుంబసభ్యులు జరిగిన ఘటనపై శుక్రవారం సాయంత్రం స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రాజయ్య, రాకేష్‌లను అదుపులోకి తీసుకోగా, పరారీలో ఉన్న లక్ష్మణ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన సమాచారం అందుకున్న కరీంనగర్ పోలీసు కమిషనర్ వి.బి.కమలాసన్‌రెడ్డి శనివారం రామడుగు పోలీసు స్టేషన్‌కు చేరుకుని ఘటన వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ మతిస్థిమితం లేని బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు నిందితులపై పోక్స్, నిర్భయ, ఐటి, అత్యాచారం కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. రాజయ్య, రాకేష్‌లను అదుపులోకి తీసుకున్నామని, లక్ష్మణ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఈ కేసును కరీంనగర్ ఎసిపికి బదిలీ చేస్తున్నట్లు తెలిపారు.
బాధితురాలికి న్యాయం జరిగే విధంగా నిందితులను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి శిక్షలు పడేలా చేస్తామని అన్నారు. వాట్సప్‌లో పోస్ట్ చేయడంతో చాలామంది సెల్‌ఫోన్‌లలో ఆ వీడియో చిత్రాలు ఉన్నట్లు తమ దర్యాప్తులో తేలిందని, వీడియో చిత్రాలు కలిగి ఉన్న వ్యక్తులు తమ మొబైల్ ఫోన్లను స్థానిక పోలీసు స్టేషన్‌లో స్వచ్ఛందంగా అప్పగించాలని, లేనిపక్షంలో చిత్రాలు కలిగిన ఫోన్ నెంబర్లను ట్రేస్ అవుట్ చేసి వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని కమిషనర్ కమలాసన్‌రెడ్డి హెచ్చరించారు. కమిషనర్ వెంట చొప్పదండి సిఐ లక్ష్మిబాబు, రామడుగు ఎస్‌ఐ నరేష్‌రెడ్డి ఉన్నారు.