తెలంగాణ

నోడల్ అధికారులకు సివి ఆనంద్ శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 8: వచ్చే నెల 11 నుంచి మార్చి 8వ తేదీ వరకు జరుగనున్న అయిదు- ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాల ఎన్నికల విధులు నిర్వహించే కీలక నోడల్ అధికారులకు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్ సివి ఆనంద్ దిశానిర్దేశం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్లిన సివి ఆనంద్ నిర్వాచన్ సదన్‌లో ఆదివారం జరిగిన సమావేశంలో నోడల్ అధికారులను ఉద్దేశించి ప్రసంగించినట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఎన్నికల వ్యయ నియంత్రణ, నిఘా సమాచార సేకరణ, ఎన్నికల విధుల వ్యక్తులు, సంస్థల మధ్య సమన్వయ సాధన’ అనే అంశంపై ఆనంద్ కీలకోపన్యాసం చేశారు. గతంలో తమిళనాడు ఎన్నికలలో ప్రధాన పరిశీలకునిగా, 2014 సాధారణ ఎన్నికలలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా తన అనుభవాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఎన్నికల విధుల నిఘా బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్ వాహనాలకు జిపిఎస్ పరికరాలు, ఉమ్మడి కంట్రోల్ రూమ్ ఏర్పాటు, అనుమానితుల బ్యాంక్ ఖాతాలు, ఎటిఎంల లావాదేవీలు, నగదు బదిలీపై నిఘా, స్వచ్ఛంద సంస్థలు, స్వయం సేవా సంస్థల ఖాతాలపై నిఘా, రహస్య సమాచార సేకరణ వ్యూహాలు, మత్తుపానీయాల అమ్మకాలపై నిఘా తదితర అంశాలపై నోడల్ అధికారులకు సివి ఆనంద్ పలు సూచనలు చేశారు.

చిత్రం..ఢిల్లీలో నిర్వాచన్ సదన్‌లో ఆదివారం జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోడల్
అధికారులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న పౌరసరఫరాల శాఖ కమిషనర్ సివి ఆనంద్