తెలంగాణ

అణచివేస్తున్నారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 8: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రజాస్వామ్య వ్యవస్థలను, సంస్థలను అణచివేస్తున్నారని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. ఆదివారం తెలంగాణ గిరిజన జాయింట్ యాక్షన్ కమిటీ ఆవిర్భావ సభ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రసంగిస్తూ గిరిజనులు, లంబాడీలు కెసిఆర్ మాటలను నమ్మి మోసపోయారన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీనిచ్చి గద్దెనెక్కిన కెసిఆర్, ఇంటికో ఉద్యోగం అననేలేదని చెప్పడం సిగ్గు చేటన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షాల సభ్యులకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా చేస్తున్నారని, మీడియాను కూడా నియంత్రిస్తున్నదని ఆయన విమర్శించారు. ఎర్రవల్లి, ఐడిహెచ్ కాలనీల్లో తప్ప 30 నెలల్లో గిరిజనులకు ఒక్క డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు నిర్మించలేదని అన్నారు. గిరిజనులు, తండాల ప్రజల జీవితాలు మెరుగుపడాలంటే ఐక్యంగా పోరాడాలని పిలుపు నిచ్చారు.
తండాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలి
టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ ప్రసంగిస్తూ ఆదివాసి ప్రాంతాల్లో ఐటిడిఎ తరహాలో తండాల అభివృద్ధికి ఒక ప్రత్యేక ప్రణాళికను ఏర్పాటు చేయాలని అన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించి రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. బలవంతపు భూ సేకరణలో మొదటి దెబ్బ లంబాడీలకే తగులుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ స్ఫూర్తితో ప్రభుత్వంపై మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
మాజీ ఎంపి రవీంద్ర నాయక్ మాట్లాడుతూ ఉగాదిలోగా తండాలను గ్రామ పంచాయతీలుగా చేయకపోతే అంతు చూస్తామని హెచ్చరించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి తండాలను గ్రామ పంచాయతీలుగా చేయడంలో ఉన్న అభ్యంతరాలు ఏమిటని ప్రశ్నించారు.