తెలంగాణ

జాతీయ చెస్ పోటీల్లో తెలంగాణ విద్యార్థి ప్రతిభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 8: నాగ్‌పూర్‌లో ఈ నెల 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరిగిన నేషనల్ స్కూల్స్ చెస్ చాంపియన్‌షిప్-2017 పోటీల్లో హైదరాబాద్‌కు చెందిన మాస్టర్ ఆర్ రాజా రిత్విక్ రజత పతకం సాధించాడు. అండర్ 13 కేటగిరీలో ఈ పతకం చేజిక్కించుకున్నాడు. జూబ్లిహిల్స్‌లోని ఆర్కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూలులో రాజా రుత్విక్ 8వ తరగతి చదువుతున్నాడు. 9 రౌండ్లలో 8 పాయింట్లు సాధించి నేషననల్ రన్నర్ అప్‌గా నిలబడ్డాడు. హైదరాబాద్‌లో రేస్ చెస్ అకాడమిలో ఎన్ రామరాజు వద్ద అడ్వాన్స్ కోచింగ్ తీసుకుంటున్నాడు. ఈ పోటీల్లో తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, న్యూఢిల్లీ, పశ్చిమబెంగాల్, గోవా, కర్నాటక, ఒడిశా, పంజాబ్, మధ్యప్రదేశ్‌లకు చెందిన బాల చెస్ క్రీడాకారులు పాల్గొన్నారు.

చిత్రం..రాజా రుత్విక్