తెలంగాణ

ఐపిఎస్‌ల బదిలీలకు రంగం సిద్ధం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 8: తెలంగాణలో ఐపిఎస్‌ల బదిలీలకు రంగం సిద్ధమైంది. పోలీస్ శాఖలో కింది స్థాయి ఉద్యోగుల పదోన్నతులపై కోర్టు స్టే ఇచ్చినప్పటికీ, ఆయా విభాగాల్లోని డిఐజీలు, ఐజీలు, ఏడిజీలుగా ఉన్నవారికి పదోన్నతి కల్పిస్తూ బదిలీ చేసేందుకు పోలీస్ శాఖ కసరత్తు పూర్తి చేసినట్టు సమాచారం. ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో భేటీ అయిన డిజపి అనురాగ్ శర్మ సోమ లేదా మంగళవారాల్లో ఐపిఎస్‌ల బదిలీలపై ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. ఐపిఎస్ అధికారుల పదోన్నతులకు సంబంధించి డిజిపి అనురాగ్‌శర్మతో పాటు డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్స్ కమిటీ (డిపిసి) సిఎస్ ఎస్పీ సింగ్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఏసిబి డైరెక్టర్ ఏకె ఖాన్ పదవీ విరమణ తరువాత ఏసిబి డైరెక్టర్‌గా చారుసిన్హా ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. టిఎస్‌పిఏ డైరెక్టర్ ఈష్‌కుమార్ సెంట్రల్ సర్వీసుకు వెళ్లడంతో ఐజి (శిక్షణ) శ్రీనివాస్‌రెడ్డి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. విజిలెన్స్ విభాగంలో సుదీప్ లక్టాకియా సెంట్రల్ సర్వీసుకు వెళ్లడంతో హోంశాఖ కార్యదర్శి రాజీవ్ త్రివేది అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న వారికి పదోన్నతులు కల్పించి ఆయా విభాగాల బాధ్యతలు అప్పగించనున్నట్టు సమాచారం. కాగా తమిళనాడు క్యాడర్‌కు చెందిన డిఐజి (శాంతిభద్రతలు) కల్పన నాయక్‌కు అక్కడి ప్రభుత్వం ఇటీవలే ఐజీగా పదోన్నతి కల్పించింది. త్వరలో బదిలీలు జరుగనున్న నేపథ్యంలో ఎవరెవరికి ఏయే పోస్టులు దక్కనున్నాయనే అంశం అధికారులతో పాటు సిబ్బందిలోనూ చర్చనీయాంశంగా మారింది. పదోన్నతులపై అధికారుల్లో ఉత్కంఠ నెలకొంది.