తెలంగాణ

తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అరవింద్ కుమార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 8: దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్ నూతన రెసిడెంట్ కమిషనర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ బాధ్యతలు స్వీకరించానున్నారు. పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్న అరవింద్‌ను ఇటీవల తెలంగాణ పభుత్వం ఢిల్లీకి బదిలీ చేసింది. ప్రస్తుతం తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న శశాంక్ గోయల్ నుండి అరవింద్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. 2015 ఏప్రిల్ 14 నుండి తెలంగాణ భవన్ రెంసిడెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న శశాంక్ గోయల్‌ను ఎక్కడికీ బదిలీ చెయ్యలేదు. పరిశ్రమలు, ఐటి ముఖ్య కార్యదర్శిగా, పట్టణాభివృద్ధి ఇన్‌ఛార్జి ముఖ్యకార్యదర్శిగా అరవింద్ కుమార్ సేవలందించారు. దేశ విదేశాల నుండి హైదరాబాద్‌లో పెట్టుబడులు తీసుకురావడంలో అరవింద్ కీలకంగా వ్యవహరించారు. తెలంగాణ ప్రభుత్వానికి ఢిల్లీ అవసరాల నేపథ్యంలో అరవింద్ కుమార్‌ను ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా బదిలీ చేసినట్టు తెలుస్తోంది.