తెలంగాణ

కరుణతో కటాక్షం.. కనులార దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, ధర్మపురి, వేములవాడ, బాసర, పాపన్నపేట, జనవరి 8: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ వైకుంఠ ఏకాదశి శోభతో మెరిసిపోయాయి. విష్ణుస్వరూపుడైన స్వామివారిని ఉత్తరద్వార దర్శనంతో తిలకించి భక్తులు పులకించిపోయారు. యాదగిరిగుట్ట బాలాలయంలో స్వామివారు తూర్పు ద్వార దర్శనమివ్వగా పాతగుట్ట ఆలయంలో ఉత్తరద్వార దర్శనమివ్వగా భక్తులను కరుణించడం విశేషం. మరోవైపు ధర్మపురిలో లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలోను, వేములవాడ రాజరాజేశ్వరి ఆలయం, బాసరలో జ్ఞానసరస్వతి క్షేత్రం, ఏడుపాయలలోని వనదుర్గామాత ఆలయంలోనూ వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు నిర్వహించారు. లక్షలాది మంది భక్తిశ్రద్ధలతో ఇష్టదైవాలను దర్శించి పునీతులయ్యారు. అటు భ ద్రాద్రిలో ఆదివారం నాడు అధ్యయ నోత్సవాల ముగింపు సందర్భంగా శ్రీరామ చంద్రుడు గోదావరి నదిలో హంస వాహనంపై విహరించారు. ఈ క్షేత్రం లో ముక్కోటి వేడుకలు సోమవారం నిర్వహించనున్నారు.
యాదగిరిగుట్టలో...
యాదగిరిగుట్టలోని లక్ష్మినృసింహస్వామివారి బాలాలయంలో ఆదివారం వేకువజామున వైకుంఠద్వార దర్శనంకోసం భక్తులు అర్ధరాత్రి నుంచి వేచి చూశారు. వేద పండితుల పారాయణ, అర్చక స్వాముల మంత్రోచ్చరణ, మంగళవాయిద్యాల నడుమ యాదగిరి లక్ష్మీనరసింహుడు దివ్యమైన అలంకారంతో కనువిందు చేశాడు. ఉదయం 6.48 గంటలకు స్వామివారు బాలాలయంలోని తూర్పుద్వారం వద్ద దర్శనమిచ్చారు. అన్ని ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం ఇవ్వడం వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత కాగా బాలాలయంలో తూర్పుద్వార దర్శనం పరిపాటి. సకలాభరణ భూషితుడైన యాదగిరి నరసింహుడు లక్ష్మీ సమేతుడై గరుడవాహనంపై వేంచేయగా భక్తులు జయజయధ్వానాలు పలికారు. ఆలయ ప్రధానార్చకులు నల్లంధీగల్ లక్ష్మినర్సింహాచార్యులు, కారంపూడి నర్సింహాచార్యుల ఆధ్వర్యంలో అర్చకబృందం ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు నిర్వహించారు. కాగా యాదగిరిగుట్ట సమీపంలోని శ్రీ పాత లక్ష్మినర్సింస్వామివారి పుణ్యక్షేత్రంలోస్వామివారు ఉత్తరద్వార దర్శనమిచ్చారు. ఉదయం 6.48 గంటలకు ఆలయ ఉత్తర ద్వారాలు తెరుచుకోగా మబ్బు తెరలలోంచి నృసింహుడు లక్ష్మిదేవి సహితంగా గరుడవాహనంపై వేంచేశాడు. అనంతరం నమ్మాళ్వారు సేవ వెంటరాగా తిరుమాడ వీధుల్లో ఊరేగారు.
ధర్మపురిలో...
ప్రాచీన పుణ్యక్షేత్రమైన ధర్మపురిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఆదివారం వైకుంఠ ఏకాదశి ఉత్సవ వేడుకలు కన్నుల పండువగా, వైభవోపేతంగా జరిగాయి. ఉదయాత్పూర్వం 2.30 గంటలకు, వేద మంత్రోచ్ఛారణల మధ్య, గోదావరి నుండి అర్చకులు పవిత్ర నదీ జలాలను తీసుకువచ్చి, శ్రీ యోగానంద, ఉగ్ర లక్ష్మీసమేత నారసింహ, శ్రీ వేంకటేశ్వర స్వాముల మూల విరాట్టులకు సంప్రదాయ విధి విధాన రీతిలో, మహాక్షీరాభిషేకాది ప్రత్యేక పర్వదిన పూజలు నిర్వహించారు.
అనంతరం సర్వాంగ సుందరంగా అలంకృతులైన స్థానిక ఇలవేల్పులను ప్రత్యేక వేదికపై ఆసీనులుగావించారు. జయజయ ధ్వనాల మధ్య ధర్మపురి శ్రీమఠం పీఠాధిపతి పరమహంస పరివ్రాజకాచార్య శ్రీశ్రీశ్రీ సచ్చితానంద సరస్వతీ స్వామి, గుంటూరు దత్త పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విశ్వయోగి విశ్వంజీ కరకమలాలచే వైకుంఠ ద్వార దర్శన పూజలొనరించిన అనంతరం ఉత్తర ద్వారాన్ని తెరువగా, వైకుంఠ ద్వారంనుండి క్రమపద్ధతిలో క్యూలైన్ల ద్వారా ప్రవేశించిన భక్తులు, నయనానందభరితులై తనివి తీరా ఇలవేలుపులను దర్శించుకున్నారు.
సూర్యోదయానంతరం ఉత్తరద్వారం గుండా పురవీధులలో ఊరేగింపుకై స్వాముల ఉత్సవమూర్తులను తీసుకెళ్ళారు. నిజామాబాద్‌కు చెం దిన భక్తులు బచ్చు రాముగుప్తా సోదరుల పక్షాన రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను, ‘ఉప్పు’ పక్షపత్రిక వార్షికోత్సవ సంచికను ఈ సందర్భంగా ఆహూతులైన ప్రముఖులు దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ వివేక్, చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, జడ్పి చైర్ పర్సన్ తుల ఉమ, ఎంపీ సుమన్ అవిష్కరించారు.
వేములవాడలో...
సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు కనులపండువగా జరిగాయి. విద్యుద్దీపకాంతులతో మెరిసిపోతున్న ఆలయానికి తెల్లవారుజామునుంచే భక్తు లు పోటెత్తారు. శ్రీ అనంతపద్మనాభ స్వామివారికకి, శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి అభిషేకాలు నిర్వహించిన అనంతరం ఉత్తరద్వార దర్శనం కల్పించారు.
ఏడుపాయలలో..
తెలంగాణలో ప్రసిద్ధ క్షేత్రమైన ఏడుపాయలలోని వనదుర్గామాత ఆలయానికి వైకుంఠ ఏకాదశి సందర్భంగా పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. ఏడుపాయల్లో పవిత్రస్నానాలు ఆచరించిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మహారాష్ట్ర,ఒడిశా, ఏపి, కర్నాటక నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చి ఏకాదశి పూజలు నిర్వహించారు.
బాసరలో...
బాసర:వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని బాసర క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ఉదయం గోదావరి సన్నిధిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు గోదారమ్మకు ప్రత్యేక పూ జలు నిర్వహించారు.
వైకుంఠ ఏకాదశి కావడంతో అక్షరాభ్యాస పూజలకు పెద్దఎత్తున ప్రాధాన్యం ఇచ్చిన భక్తులు గంటల తరబడి బారులు తీరారు. నిరంతరాయంగా అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించేందుకు ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. పదివేలమంది ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు భావిస్తున్నారు.
భద్రాద్రిలో తెప్పోత్సవం
భద్రాచలంలో కొలువైన శ్రీ సీతా రామచంద్ర స్వామివారి దేవ స్థానం లో ముక్కోటి ఏకాదశి వేడు కలను సోమవారం నిర్వహిం చనున్నా రు. ఇక్కడ నిర్వహిస్తున్న అధ్యయనో త్సవాలు ఆదివారం ముగిసాయ. ఈ సందర్భంగా గోదావరిలో సీతాలక్ష్మ ణ సమేతుడైన శ్రీరామచంద్రుడు హంస వాహనంపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ తిరు మంగై ఆళావర్ పరమపదోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజా కార్య క్రమాలు నిర్వ హించారు.

చిత్రాలు..యాదగిరిగుట్టలో స్వామి వారిని దర్శించుకుంటున్న భక్తులు.. ధర్మపురిలో దర్శనమిచ్చిన శ్రీలక్ష్మీనృసింహస్వామి