తెలంగాణ

తిరుమల, ఒంటిమిట్టలో వైభవంగా ముక్కోటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంటిమిట్ట/తిరుపతి, జనవరి 8 : కలియుగ వైకుంఠ నాధుడు కొలువదీరిన తిరుమల క్షేత్రంలోను, అక్కడికి సమీపంలోని కడప జిల్లా ఒంటిమిట్టలోను ఆదివారం ముక్కోటి ఏకాదశి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. తిరుమల క్షేత్రంలో వేంకటేశుడు దర్శనమిస్తే ఒంటిమిట్టలో శ్రీరామచంద్రుడి రూపంలో వైకుంఠద్వారం ద్వారా భక్తులకు దర్శనమిచ్చారు. ఒంటిమి ట్టలో తొలుత అర్చకులు శ్రీసీతారామలక్ష్మణ మూలవిరాట్‌లకు ప్రత్యేక అభిషేకాలు చేసి, వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. తెల్లవారుజామున 5-30 గంటలకు గరుడ వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణులు వేంచేసి ఉత్తర ద్వారంలో భక్తులకు కనువిందు చేశారు. అనంతరం పురవీధుల్లో సీత సమేతంగా లక్ష్మణస్వామితో కలిసి రామయ్య ఊరేగారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టిటిడి అన్ని వసతులు కల్పించింది. దాదాపు 50 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని ఉంటారని అంచనా.
తిరుమలలో....
శ్రీవారి ఆలయంలో ఆదివారం ముక్కోటి ఏకాదశి వేడుకలు కన్నులపండువగా నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీవారిని దర్శించుకోవడానికి లక్షకు పైగా భక్తులు వస్తారని టిటిడి యాజమాన్యం ముందుగానే గుర్తించి చేసిన ఏర్పాట్లు భక్తులను సంతృప్తిపరచాయి. ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర స్థాయి మంత్రులే కాకుండా ప్రభుత్వ ఉన్నతాధికారులు, న్యాయమూర్తులు కూడా తరలివచ్చారు. అయితే వీరికి వైకుంఠ ఏకాదశి రోజున కల్పించే ప్రాధాన్యత దర్శనాన్ని అతి ముఖ్యులకు మాత్రమే ఇవ్వడంతో 2.30 గంటల వ్యవధిలోనే వారి దర్శనాలు పూర్తిచేయించారు. దీంతో ఆదివారం ఉదయం 4.10 గంటలకు సామాన్య భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. 7వ తేదీ రాత్రి నుంచే భక్తులు పెద్దఎత్తున తిరుమలకు చేరుకొని వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లలోనూ, ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన తాత్కాలిక షెడ్లల్లోనూ కూర్చున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయానికే 45,444 వేల మంది స్వామివారిని దర్శించుకోగా మరో 50 వేల మంది స్వామిదర్శనం కోసం వేచి ఉన్నారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లతో పాటు భక్తులు ఎక్కువసేపు క్యూలైన్లలో నిలిచి ఉండకుండా దాదాపు 15 వేల మంది కూర్చునేందుకు వీలుగా నారాయణగిరి ఉద్యానవనాల్లో 16 తాత్కాలిక కంపార్ట్‌మెంట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం తిరుమలలో స్వర్ణరథోత్సవం వైభవంగా జరిగింది.

చిత్రం..తిరుమలలో భక్తుల రద్దీ