తెలంగాణ

జంట కమిషనరేట్ల పరిధిలో 9 మంది పోలీస్ అధికారుల సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 8: జంట కమిషనరేట్ల పరిధిలో పక్షం రోజుల్లో 9 మంది పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. విధుల్లో నిర్లక్ష్యం, ఠాణాకు వచ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేయకుండా అక్రమాలకు పాల్పడినట్టు అభియోగాలపై 9మంది పోలీసులు సస్పెన్షన్‌కు గురయ్యారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్‌కు చెందిన వెంకటరమణ, శ్యామల వృద్ధ దంపతులను రాజు అనే రియల్టర్ బెదిరించి వారి ఇంటిని కబ్జా చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో మియాపూర్ పోలీసులు ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించడంతో వీరు సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌ను కలసి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ జరిపిన కమిషనర్ సందీప్ శాండిల్య మియాపూర్ సిఐ కె రమేశ్, ఎస్‌ఐ రాములును సస్పెండ్ చేశారు. అదేవిధంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ముగ్గురు పోలీస్ అధికారులను కమిషనర్ ఎంఎం భగవత్ సస్పెండ్ చేశారు. ఎల్‌బినగర్ ట్రాఫిక్ సిఐ ఖాజామోహినుద్దీన్‌తోపాటు బాలాపూర్, పహాడీషరీఫ్, కీసర పోలీస్ స్టేషన్లకు చెందిన ముగ్గురు పోలీస్ అధికారులను అవినీతి, అక్రమాల అభియోగంపై రాచకొండ కమిషనర్ భగవత్ సస్పెండ్ చేశారు. అదేవిధంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో నోట్ల మార్పిడి కేసులో ఇద్దరిని సస్పెండ్ చేశారు. స్థల వివాదంలో ఓ వ్యక్తితో సంభాషణలు జరుపుతోన్న లీకేజీ విషయంలో ఓ ఏసిపి కూడా సస్పెండ్ అయ్యారు. పదిహేను రోజుల్లో తొమ్మిది మంది పోలీస్ అధికారులు సస్పెండ్ కావడం పోలీస్ కమిషనరేట్లలో కలకలం రేపుతోంది.