తెలంగాణ

గుండె ఆపరేషన్లలో ఆధునిక మెళకువలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 8: గుండె ఆపరేషన్లలో కొత్త సాంకేతిక వైద్య విధానాలు అమలులోకి వచ్చాయని ప్రముఖ కార్డియోథొరాసిక్ సర్జన్లు డాక్టర్ విజయ దీక్షిత్, డాక్టర్ విఏ సుబ్రమణియన్‌లు ప్రకటించారు.
ఆదివారం ఇక్కడ జరిగిన అపోలో అడ్వాన్స్‌డ్ కార్డియాక్ టెక్నిక్స్ టెక్నాలజీస్ ఇన్ సర్జరీ సదస్సులో పాల్గొన్న తర్వాత వారు విలేఖర్లతో మాట్లాడుతూ నూతన సాంకేతిక విధానాల వల్ల తక్కువ కోతతో సర్జరీ విధానం, తక్కువ ఇన్‌ఫెక్షన్ మాత్రమే కలగడం, రోగి త్వరగా కోలుకోవడం, రోగి ఆసుపత్రిలో గడిపే సమయం తగ్గడం వంటి చక్కటి ఫలితాలు వస్తున్నాయన్నారు. రోగి తక్కువ సమయంలో కోలుకునేందుకు వీలుందన్నారు. కార్డియో థొరాసిక్ సర్జరీకి చెందిన కార్డియాక్ వాల్వ్ పద్ధతులు, మిని థ్రొక్టమి, మినిస్టెర్నోటమి, మల్టీ వెస్సల్ మిడ్ క్యాబ్, క్యాథటర్ ఆధారిత సర్జికల్ ఇంటర్వెన్షన్స్, కరోనరి అనాస్టోమొటిక్ పరికరాలు వచ్చాయని న్యూయార్కుకు చెందిన వైద్య నిపుణులు డాక్టర్ నిరవ్ సి పటేల్ చెప్పారు. ఈ వర్క్‌షాపులో లైవ్ ఇన్ బాక్స్ అంశంపై నూతన విధానంలో గుండె ఆపరేషన్ నిర్వహణ గురించి తెలియచేసినట్లు అసోసియేటెడ్ ప్రొఫెసర్ డాక్టర్ రామచంద్రారెడ్డి తెలిపారు.