తెలంగాణ

మధ్యాహ్న భోజనం వికటించి 80మంది విద్యార్థినులకు అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిరుదొడ్డి, జనవరి 8: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి గ్రామంలోని కెజిబివి కేంద్రంలో ఆదివారం మధ్యా హ్న భోజనం తిన్న విద్యార్థినులలో 50మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మరో 30 మంది స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. వీరందరినీ మొదట మిరుదొడ్డిలోని ప్రభుత్వ అసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆసుపత్రి తెరచిలేకపోవడంతో ప్రైవేట్ అసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేశారు. ఫలితం లేకపోవడంతో సిద్దిపేట ఏరియా అసుపత్రి, మాతశిశు సంక్షేమ అసుపత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన వారిలో రేవతి, కవిత, రజిత, భార్గవి, మానస, శివాని, రాధ, భార్గవితోపాటు మరికొంత మంది సిద్దిపేట అసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. విద్యార్థుల సమస్యలను పలుమార్లు స్ధానిక అధికారులకు, ఎంపిపి కవిత, దుబ్బాక ఎమ్మెల్యే రాంలింగారెడ్డి విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వంటపనివారిని మార్చలని పలుమార్లు మొరపెట్టకున్నప్పటికి నేటి వరకు మార్చకపోవడంతోనే ఈ సంఘటన చోటు చేసుకుందని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు.