తెలంగాణ

మూతబడిన సిఎఫ్‌సి..రోడ్డునపడిన గిరిజనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాంకిడి, జనవరి 8: టేకు కలప, వెదురు, ఇతర అటవీ ఉత్పత్తులు, అటవీప్రాంతంలో దొరికే ప్రత్యేకమైన ఇనుపఖనిజంతో అందమైన వస్తువులు, ఫర్నిచర్ తయారీలో శిక్షణ ఇచ్చి గిరిజనులకు ఉపాధి చూపి దేశవ్యాప్తంగా పేరుపొందిన సంస్థ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి కామన్ ఫెసిలిటి సెంటర్ (సిఎఫ్‌సి). ఐటిడిఎ ఆధ్వర్యంలో 1979లో ఏర్పడిన ఈ సంస్థ 2012 వరకు నిరాఘాటంగా పనిచేసి ఎంతోమందికి ఉపాధి చూపింది. ఎందరినో తీర్చిదిద్దింది. ముఖ్యంగా గిరిజన కుటుంబాలకు వెన్నుదన్నుగా నిలిచింది. 2012లో మూతబడటంతో వందలాది గిరిజన నిరుద్యోగులు ఇప్పుడు రోడ్డున పడ్డారు. నిజానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 8 సిఎఫ్‌సిలు ఉండేవి. వాటిలో వాంకిడి కేంద్రం మినహా మిగతావన్నీ ప్రారంభమైన కొన్నాళ్లకే మూతబడ్డాయి. సిఎఫ్‌సి కేంద్రాన్ని మళ్లీ తెరిపించాలని చేస్తున్న ప్రయత్నాలు కార్యరూపం దాల్చలేదు. ప్రత్యేక తెలంగాణ సాధ్యమైన తరువాతైనా ఈ కేంద్రానికి మళ్లీ జీవం వస్తుందన్న ఆశతో ఉన్న గిరిజనులకు ఇంతవరకు తీపికబురు లేదు.
గిరిజనులకు వెన్నుదన్ను
వాంకిడిలో 1979లో ఏర్పడిన ఈ సిఎఫ్‌సి 2006 వరకు ఒక వెలుగు వెలిగింది. ఉన్నత వర్గాలకు చెందినవారికోసం అవసరమైన గృహోపకరణ వస్తువుల తయారీనుంచి సినీ పరిశ్రమ అవసరాలకు తగ్గట్టు ఎన్నో కొత్త డిజైన్లతో కూడిన ఫర్నిచర్లు ఇక్కడ తయారయ్యేవి.ఈ సంస్థ తయారు చేసే వస్తువులకు ఉన్న డిమాండ్ దృష్ట్యా హైదరాబాద్‌లో సొంత షో రూమ్‌కూడా నిర్వహించేవారు. దీనిమీద పూర్తి అజమాయిషి ఐటిడిఎకే ఉండేది. మంచి అధికారులు ఉన్నంతకాలం ఈ సంస్థ బాగానే నడిచింది. అయితే మూడు పూలు ఆరు కాయలుగా విరాజిల్లుతున్న సమయంలో 2010 తర్వాత వచ్చిన జిల్లా అధికారులు దీనిని సొంతానికి వాడుకోవడం మొదలు పెట్టారు. ఇక్కడ మేలురకం టేకు కలపతో చేసిన ఫర్నీచర్‌ను సొంతానికి తరలించేవారు. దానికి సంబంధించిన బిల్లులు చెల్లించేవారు కాదు. దీంతో ఆర్థికంగా దెబ్బతిన్న సంస్థ చివరకు మూతబడిందని కార్మికులు చెబుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు ఇక్కడకు వచ్చిన ఆంధ్రప్రాంత అధికారుల వైఖరివల్ల ఈ కేంద్రం మూతపడిందని వారు అంటున్నారు. 2010 నుంచి ఆర్థికంగా దెబ్బతిన్న ఈ సంస్థ చివరకు 2012లో మూతపడింది. ఈ సంస్థపై ప్రత్యక్షంగా ఆధారపడిన గిరిజనులు రోడ్డునపడ్డారు. దేశవ్యాప్తంగా పేరుపొందిన ఈ సిఎఫ్‌సి మళ్లీ అలనాటి వైభవం రావాలని కోరుకుంటున్నారు.