తెలంగాణ

విద్యారంగాన్ని తుంగలో తొక్కిన ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంషాబాద్, జనవరి 8: విద్యారంగాన్ని ప్రభుత్వం తుంగలో తొక్కిందని ప్రొఫెసర్ కోదండరామ్ విమర్శించారు. ఆదివారం ఎస్‌ఎఫ్‌ఐ 2వ రాష్ట్ర మహాసభ ముగింపు కార్యక్రమానికి హజరైన కోదండరామ్ మాట్లాడుతూ కార్పొరేట్ శక్తులకు దాసోహమైన ప్రభుత్వం విద్యరంగాన్ని పూర్తిగా భ్రస్టుపట్టించిందని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాడితే బతుకులు బాగుపడుతాయని, పోలీసుల దెబ్బలకు భయపడకుండా ఉద్యమాలు చేసి రాష్ట్రం సాధించి, టిఆర్‌ఎస్‌ను అధికారంలోకి తీసుకువస్తే చివరకు చదుకునే అవకాశం పోయిందని ఆరోపించారు. అధికారంలోకి రాక ముందు రాష్ట్రం ఏర్పాడితే విద్యార్థులకు, నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని చెప్పి ఇప్పుడు రోడ్డున పడవేశారని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసిన ప్రభుత్వం చూసి చూడన్నట్లు వ్యవహరిస్తుందని చెప్పారు. ప్రభుత్వ పనితీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, అవసరమైనప్పుడు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోతే రాష్టవ్య్రాప్తంగా ఉద్యమాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి రమేష్, సాబశివ, రాష్ట్ర ఉపాధ్యాక్షుడు నగేశ్వర్‌రావు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్ కారత్, కార్యదర్శి జగదీష్, జిల్లా నాయకులు ఆనంద్, మండల అధ్యక్ష, కార్యదర్శిలు ప్రణయ్, చందు పాల్గొన్నారు.