తెలంగాణ

ఆడపిల్లలను గౌరవించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 9: గురు శిష్యుల అనుబంధం చాలా గొప్పదని రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. విలువలతో కూడిన విద్యనూ అందించడం గురువుల బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. బేగంపేట పబ్లిక్ స్కూల్‌లో జరుగుతున్న 77వ ఇండియన్ పబ్లిక్ స్కూల్స్ కాన్ఫరెన్స్‌లో గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ పాల్గొన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలతో పాటు పెద్దలను, ఆడపిల్లలను గౌరవించడం చిన్నప్పటి నుండి పిల్లలకు నేర్పించాలని అన్నారు. ఈ సందర్భంగా జీవిత సాఫల్య పురస్కారాన్ని డాలీ కాలేజీ ప్రిన్సిపాల్ సుమీర్ సింగ్‌కు అందజేశారు. మూలాలను పటిష్టం చేసుకుంటూ అవకాశాల రెక్కలను విచ్చుకోవడం అనే సందేశంతో మూడు రోజుల పాటు దేశంలో ప్రసిద్ధి చెందిన పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్స్‌తో ఈ సదస్సు జరుగుతోంది. ఇందులో కమాండర్ వి కె బంగా, కెప్టెన్ ఎ జె సింగ్, నిషి మిశ్రా, డాక్టర్ జగ్‌ప్రీత్ సింగ్, రమేష్ చంద్ర జోషి, విద్యావంత్ ఆచార్య, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ లతా శంకర్ తదితరులు పాల్గొన్నారు.