తెలంగాణ

ఇంజనీరింగ్ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 9: ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులందరికీ ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయని ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యాఖ్యానించి విద్యార్థుల్లో భయాందోళనలు సృష్టించారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్ రెడ్డి విమర్శించారు. ఇందుకు కెసిఆర్ యువతకు క్షమాపణ చెప్పాలని సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఉచితంగా కెజిటు పిజి అంటున్నారే తప్ప డిఎస్సీని నిర్వహించటం లేదని ఆయన విమర్శించారు. యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ చేయడం లేదని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకపోగా, గ్రామాల్లోని విద్యార్థులకు చదువుకునే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారని ఆయన విమర్శించారు. స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని గొప్పలు చెబుతూనే కుల వృత్తుల వారు ప్రత్యామ్నాయ అవకాశాలు చూసుకోవాలని చెప్పడం విచిత్రంగా ఉందని ఆయన తెలిపారు.