తెలంగాణ

మిర్యాలగూడను జిల్లా చేయాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ముషీరాబాద్, జనవరి 9: మిర్యాలగూడను జిల్లాగా, హుజూర్‌నగర్‌ను రెవెన్యూ జిల్లాగా ప్రకటించే వరకు నిరంతరం ఉద్యమం కొనసాగిస్తామని జిల్లా సాధన కమిటీ వెల్లడించింది. ఈమేరకు మిర్యాలగూడ, హుజూర్ నగర్, నాగార్జున సాగర్ నియోజకవర్గాల అఖిలపక్ష జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించింది. సిపిఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అధ్యక్షతన జరిగిన మహాధర్నాకు కాంగ్రెస్, టిడిపి, బిజెపి, ప్రజాసంఘ పక్ష నేతలు హాజరై సంఘీబావం తెలిపి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సిఎల్‌పి నేత జానారెడ్డి మాట్లాడుతూ ప్రజాబిప్రాయం మేరకు జిల్లాల ఏర్పాటు జరగలేదని, అశాస్ర్తియంగా జరిగిన జిల్లాలు ఆమోదయోగ్యంగా లేవన్నారు. అన్ని వనరులు, సౌకర్యాలు ఉన్న మిర్యాలగూడను జిల్లాగా ప్రకటించకపోవటం ప్రభుత్వ అనాలోచితానికి నిదర్శనమన్నారు. టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఎవరి సొంత లాభం కోసం జిల్లా విభజన జరిగిందో నిలదీయాల్సిన అవసరముందన్నారు. కేంద్ర మాజీమంత్రి జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఒక నియోజకవర్గమైన సిరిసిల్లను జిల్లాగా చేసినప్పుడు మూడు నియోజకవర్గాలున్న మిర్యాలగూడను జిల్లాగా ప్రకటించకపోవటంలో ఆంతర్యమేంటన్నారు. టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ మాట్లాడుతూ, 17న తిరిగి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలలో మిర్యాలగూడను జిల్లాగా ప్రకటించాలన్నారు.