తెలంగాణ

ఉద్ధృతంగా కాంగ్రెస్ ఉద్యమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 9: నోట్ల రద్దు కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, తదితర ప్రజా సమస్యలపై మరింత ఉద్ధృతంగా ఉద్యమించేందుకు పిసిసి మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చైర్మన్‌గా రాష్ట్ర స్థాయి కార్యాచరణ కమిటీని ఎఐసిసి ప్రకటించింది. ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేపట్టేలా పార్టీని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేందుకు పొన్నాల నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తూ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమన్వయకర్త, ఎఐసిసి మాజీ కార్యదర్శి కెబి కృష్ణమూర్తి సోమవారం టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డికి లేఖ పంపించారు. కో-చైర్మన్‌గా సబితా ఇంద్రారెడ్డి, కన్వీనర్‌గా మల్లు రవి, సహ-కన్వీనర్‌గా దాసోజు శ్రవణ్, ప్రెస్ కో-ఆర్డినేటర్‌గా ప్రేంలాల్, సభ్యులుగా ఎమ్మెల్యేలు ఎం. సంపత్ కుమార్, వంశీచంద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బి. కమలాకర్ రావు, టి.పిసిసి అధికార ప్రతినిధి శ్యాం మోహన్, ఉపాధ్యక్షుడు ఆబిద్ రసూల్‌ఖాన్, సిజె శ్రీనివాస రావు, శ్రవణ్‌కుమార్ రెడ్డి, ఇందిరాశోభన్, రమ్య, వినయ్ కుమార్, మర్రి ఆదిత్యరెడ్డిని నియమించారు. ఇలాఉండగా నోట్ల రద్దుపై ఈ నెల 11న ఢిల్లీలో ఎఐసిసి నిర్వహించనున్న సభలో పాల్గొనేందుకు టి.పిసిసి ముఖ్య నేతలంతా మంగళవారం బయలుదేరి వెళ్ళనున్నారు.