తెలంగాణ

‘కడెం’ నీటి విడుదల వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడెం,జనవరి 9: నిర్మల్, మంచిర్యాల జిల్లాలోని పలు మండలాల రైతులు, ఇరు ప్రాంతాల ప్రజాప్రతినిధులు ఏకాభిప్రాయానికి రాకపోవడం కడెం ప్రాజెక్టు నీటి విడుదల వాయిదా పడింది. నిజానికి ఈనెల 7న ఈ ప్రాజెక్టు నీటిని విడుదల చేయాల్సి ఉంది. అయితే రబీ పంటలకు ఇక నీరివ్వవలసిన అవసరం లేదని ఒక ప్రాంత రైతులు అభిప్రాయ పడుతూంటే కనీసం మూడునాలుగురోజులైనా నీరిస్తే పంటలు చేతికొస్తాయని మరొక ప్రాంత రైతులు కోరుతున్నారు. ఆయా ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో వివాదం ముదిరి సోమవారం చేపట్టాల్సిన నీటి విడుదల మరోసారి వాయిదా పడింది.
కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు వద్ద రబీకి నీరు విడుదల చేసే విషయమై సోమవారం సమావేశం నిర్వహించారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, మంచిర్యాల ఎమ్మెల్యే ఎన్.దివాకర్ రావు సమక్షంలో కడెం ప్రాజెక్టు ఇఇ వేంకటేశ్వర్ రావు ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగింది. ఇరు జిల్లాల్లోని పలు మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు సమావేశానికి హాజరై తమ వాదనలు వినిపించారు. కడెం, దస్తురాబాద్ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు మాట్లాడుతూ రబీ పంటలకు సాగునీరు విడుదల చేయవద్దని, పది రోజుల తర్వాత నీటి విడుదల చేయాలని, ప్రస్తుతం పంటలకు నీరు అవసరం లేదని అన్నారు. అయితే మంచిర్యాల జిల్లాలోని దండెపల్లి, లక్షెట్టిపేట్, జన్నారం మండలాల్లోని ప్రజాప్రతినిధుల వాదన దీనికి భిన్నంగా ఉంది. పంటలకు సాగునీరు విడుదల చేయాలని, లేనిపక్షంలో నష్టం వాటిల్లే అవకాశం ఉందని, ఇటీవలే మంచిర్యాలలో జరిగిన నీటి విడుదల సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ నెల జనవరి 7వ తేదిన కడెం ప్రాజెక్టు నీటిని విడుదల చేస్తామని ప్రకటించారని, దీనిప్రకారం నీటిని విడుదల చేయాలని వారికి విన్నవించారు. దీంతో దండెపల్లి, లక్షెట్టిపేట్ మండలాల రైతులు నీటి విడుదల చేయాలని కడెం, దస్తురాబాద్‌కు చెందిన ప్రజాప్రతినిధులు, రైతులు ప్రస్తుతం నీటిని విడుదల చేయవద్దని పట్టుబట్టారు. అది కాస్తా ముదిరి పెద్ద వివాదంగా మారిపోయింది. నీటి విడుదల విషయంపై ఇద్దరు ఎమ్మెల్యేలు చర్చించుకున్నా ఫలితం లేకపోయింది. తమకు మూడు రోజులు నీటిని విడిచి ఆ తర్వాత కాల్వలు మూసివేయాలని రైతుల పంటలు కాపాడాలని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు కోరారు. దాదాపు 3 గంటలపాటు నీటివిడుదలపై ఇరుమండలాల ప్రజాప్రతినిధులు చర్చలు జరిపినా ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. ఎమ్మెల్యే రేఖ నీటి విడుదల ఆపాలని ఎస్ ఈతో చరవాణిలో మాట్లాడారు. కడెం ప్రాజెక్టు ఈ ఈ వేంకటేశ్వర్‌రావు ఇరువురు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులకు మద్దతు పలకడంతో ఎస్‌ఇ నీటి విడుదలపై సందిగ్ధంలో పడిపోయారు. అనంతరం ఎమ్మెల్యే రేఖ ఈ ఈ తీరుపై మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్‌తో ఎమ్మెల్యే రేఖ మాట్లాడి కడెం ప్రాజెక్టు నీటి విడుదల ఆపాలని మాట్లాడారు. దీంతో నీటి విడుదల కార్యక్రమం వాయిదాపడడంతో ఎవరిదారిన వారు వెళ్లిపోయారు.