తెలంగాణ

చక్కెర ఫ్యాక్టరీ సమస్యలు పరిష్కరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: నిజాం చక్కెర కర్మాగారానికి (ఎన్‌ఎస్‌ఎఫ్) సంబంధించిన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వమే పరిష్కరించాలని టిజాక్ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. నాంపల్లిలోని టిజాక్ కేంద్ర కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ, ఎన్‌ఎస్‌ఎఫ్‌లో 49 శాతం వాటా ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. ఎన్‌ఎస్‌ఎఫ్ మూసివేయడంతో కార్మికులు రోడ్డున పడ్డారని, రైతులు అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. కార్మికులకు బకాయిపడ్డ 13 నెలల వేతనాన్ని వెంటనే ఇవ్వాలని కోరారు. సింగరేణి బొగ్గుగనులకు సంబంధించి కాంట్రాక్ట్ కార్మికులే లేరంటూ అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించడం పట్ల కోదండరాం అభ్యంతరం వ్యక్తం చేశారు. సింగరేణి ఓపెన్ కాస్ట్‌మైనింగ్, ముస్లిం రిజర్వేషన్లు, విద్యార్థుల సమస్యలపై త్వరలోనే సంబంధిత నిపుణులతో సదస్సు నిర్వహిస్తామన్నారు. వివిధ ప్రాజెక్టులకు భూములు అందచేసే రైతుల పట్ల మానవతా కోణంలో వ్యవహరించాలని కోరారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం పనులు చేపట్టడం మంచిది కాదన్నారు.
సుధీర్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని టిజాక్ కో-కన్వీనర్ ఖాజా మొయినుద్దీన్ కోరారు. ఓపెన్ కాస్ట్ గనులవల్ల ఇప్పటికే 150 గ్రామాలు మాయమయ్యాయని, అందువల్ల ఓపెన్ కాస్ట్ గనులను చేపట్టవద్దని పిట్టల రవీందర్ కోరారు. ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.