తెలంగాణ

తెరాసతో బంధంపై తేల్చని బిజెపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: తెలంగాణలో భారతీయ జనతా పార్టీ భవిష్యత్ ఏమిటి? రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతోనే మళ్లీ జతకడుతుందా? లేక అధికార పక్షం టిఆర్‌ఎస్‌తో జత కడుతుందా అనే మీమాంస బిజెపి కార్యకర్తల్లో పెరిగిపోతున్నా కేంద్ర నాయకత్వం మాత్రం పెదవి విప్ప డం లేదు. పైగా టిఆర్‌ఎస్‌తో పొత్తు ఉన్నట్టో లేదా లేనట్టో ఇప్పటి నుండే భావించవద్దని, పార్టీ పరంగా ప్రజా సమస్యలపై పోరు కొనసాగించాలని కేంద్ర నాయకత్వం రాష్ట్ర కమిటీని ఆదేశించడంతో ఇటీవలి కాలంలో మద్యం అమ్మకాలపైనా, స్కాలర్‌షిప్‌లు, విద్యాసమస్యలపైనా పెద్ద ఎత్తున బిజెపి ఉద్యమాలు చేసింది. మరో పక్క టిడిపి ఉనికి పోకుండా పరోక్షంగా బిజెపి కాపాడుతూనే ఉందనే వాదన వినిపిస్తోంది. తెలంగాణలో పూర్తిగా బలహీనపడిన టిడిపితో జతకలిసి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తే పార్టీ ఎంత వరకూ నెగ్గుకు వస్తుందనే అనుమానాన్ని బిజెపి నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తెలంగాణలో త్వరలో పర్యటించనున్నారనే వార్త పార్టీ వర్గాల్లో కొత్త ఊపిరులను ఊదింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి బూత్ స్థాయిలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని కేంద్ర నాయకత్వం ఆదేశించింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో పూర్తికేడర్‌ను చైతన్య పరిచి వారితో కార్యాచరణ ప్రణాళిక అమలుచేయాలని చూస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న కీలక 16 పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పార్టీ నేతలు నిర్ణయించారు. బూత్ స్థాయిలో పార్టీ బలంగా ఉండి, సంస్థాగతంగా పటిష్టంగా ఉంటేనే విపక్షాల విమర్శలను తిప్పికొట్టి ప్రజలను బిజెపికి అనుకూలంగా మార్చుకునేలా చేయవచ్చని యోచిస్తున్నారు. త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత మూడు రోజుల పాటు అమిత్‌షా తెలంగాణలో పర్యటిస్తారు.