తెలంగాణ

అన్ని ప్రాజెక్టులనూ త్వరగా పూర్తిచేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అన్ని ప్రాజెక్టుల నిర్మాణాన్ని సత్వరమే పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, రైల్వే ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ రైల్వే ఉన్నతాధికారులను ఆదేశించారు. భారతీయ రైల్వేలో దక్షిణ మధ్య రైల్వేకు విశిష్టమైన స్థానం ఉందన్నారు. రైల్వే ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. రైళ్లు సకాలంలో గమ్య స్థానానికి సురక్షితంగా చేరుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రైల్వే స్టేషన్లలో అన్ని వౌలిక సదుపాయాల ఏర్పాటును ఉన్నతాధికారులు పర్యవేక్షించాలన్నారు. బల్లార్షా-కాజిపేట సెక్షన్‌లో సురక్షిత చర్యలను అదనపు జనరల్ మేనేజర్ ఎకె గుప్తా, డివిజనల్ రైల్వే మేనేజర్ అశిష్ అగర్వాల్ పర్యవేక్షించారు. విహిరాగావ్ స్టేషన్ వద్ద రైల్వే ట్రాక్‌ను, మలుపులను వారు తనిఖీ చేశారు. సిర్పూర్ కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్ వద్ద కూడా రైల్వే ట్రాక్‌ను వారు పరిశీలించారు. బిబ్రా వంతెన సాంకేతిత పటిష్టతను పరిశీలించారు. రామగుండం రైల్వే స్టేషన్‌లో బాటరీ రూంను తనిఖీ చేశారు. మొత్తం రైల్వేనెట్‌వర్క్‌ను వారు సాంకేతిక అధికారులతో కలిసి పర్యవేక్షించారు.