తెలంగాణ

నాలాలో ఆడ శిశువు మృతదేహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/జీడిమెట్ల, జనవరి 12: ఓ ఆడ శిశువు మృతదేహాన్ని నాలా లో పడేసిన సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాపూర్‌నగర్ రైతుబజార్ సమీపంలోని హమాలీ అడ్డా సమీపంలో ఉన్న నాలాలో మృతి చెందిన ఆడ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు పడేసి వెళ్లిపోయారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. 15 రోజుల క్రితం జన్మించి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చిత్రం..షాపూర్‌నగర్ నాలాలో పడి ఉన్న ఆడ శిశువు మృతదేహం