తెలంగాణ

భూ లావాదేవీల్లో పాత నేరస్థుడి దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ జీడిమెట్ల, జనవరి 12: భూ లావాదేవీల్లో ఓ పాత నేరస్థుణ్ని వేటకొడవళ్లతో దారుణంగా హత్య చేసిన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. పద్మానగర్‌లో నివాసముండే శైలేంద్రకుమార్ అలియాస్ చక్రవర్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు. బాపూనగర్‌లో నివాసముండే మందడి నాగేందర్‌రెడ్డి, చక్రవర్తి కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారు. వ్యాపార లావాదేవీల్లో చక్రవర్తి ప్రవర్తన నచ్చక నాగేందర్‌రెడ్డి అతనికి దూరంగా ఉంటున్నాడు. కాగా ఓ స్థల విషయంలో కక్ష పెంచుకున్న చక్రవర్తి నాగేందర్‌రెడ్డిని మట్టుబెట్టాలని పథకం పన్నాడు.
గత నవంబర్ 16వ తేదీన బాపూనగర్‌లో నివాసముండే మందడి నాగేందర్‌రెడ్డిపై కాల్పులు జరిపిన ఘటనలో చక్రవర్తి ప్రధాన నిందితుడు. ఈ కేసులో చక్రవర్తి జైలుకి వెళ్లి డిసెంబర్ 22న బెయిల్ పై వచ్చాడు. పద్మానగర్ ఫేజ్- 2లో రాంబాబు అనే వ్యక్తి ఇంటికి స్థల విషయంలో మాట్లాడేందుకు చక్రవర్తి వచ్చాడు. తనపై కాల్పులు జరిపాడనే కక్షతో నాగేందర్‌రెడ్డి మరో ఇద్దరు కుం భ రవి, కాట నాగయ్యలతో కలిసి మాటు వేసి వెం ట తెచ్చుకున్న వేటకొడవళ్లతో చక్రవర్తిపై దాడి చేసి హత్య చేశారు. చక్రవర్తి రక్తపు మడుగులో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పేట్‌బషీరాబాద్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నాగేందర్‌రెడ్డి, రవి, నాగయ్యలను అదుపులోకి తీసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. నిందితుల నుంచి మారణాయుధాలు స్వాధీనం చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని పేట్‌బషీరాబాద్ సిఐ రంగారెడ్డి తెలిపారు.

చిత్రం..పద్మానగర్ ఫేజ్- 2లో హత్యకు గురైన చక్రవర్తి మృతదేహం