తెలంగాణ

ప్రపంచ బ్యాంకు చేతుల్లోనే విద్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: విద్య పూర్తిగా ఇంకా మన చేతుల్లోకి రాలేదని విద్యావేత్త ప్రొఫెసర్ కె హరగోపాల్ అన్నారు. టిపిటిఎఫ్ రాష్ట్ర స్థాయి విద్యాసదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్షుడు కొండల్, ఉపాధ్యక్షుడు తిరుపతి పాల్గొన్న ఈ సమావేశాల్లో ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ ఇంకా విద్య ప్రపంచ బ్యాంకు చేతుల్లోనూ, వలసవాదుల చేతుల్లోనే ఉందని అన్నారు. కెజి టు పిజి వరకూ ఉచిత విద్య అంటే చాలా మార్పు వస్తుందని భావించామని పేర్కొన్నారు. పాఠశాలల్లో చేరే పిల్లలు సహజంగా తాత్విక ఆలోచనలతో ఆలోచించాలని అన్నారు. కేవలం పుస్తకాల్లోని అంశాలను బట్టీపట్టే విధానం మారాలని చెప్పారు.