కృష్ణ

ఆడపిల్లల అభ్యున్నతే దేశాభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు: ఆడపిల్లలు అభివృద్ది చెందిననాడే దేశాభివృద్ధి జరుగుతుందని తెలుగుమహిళ జిల్లా అధ్యక్షురాలు ఆచంట సునీత అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ హైస్కూలులో మంగళవారం లయన్స్ క్లబ్ ఆఫ్ తోట్లవల్లూరు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఉపాధ్యాయిని సంధ్యారాణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సునీత మాట్లాడుతూ మహిళలు విద్యతో పాటు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పురుషులతో సమానంగా ఎదగాలన్నారు. మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారని, ఆనాడు ఎన్టీఆర్ తెలుగింటి ఆడపడుచులుగా మహిళలను గుర్తించి రాజకీయ అవకాశాలను కల్పించారని గుర్తుచేశారు. మళ్లీ ఇపుడు సీఎం చంద్రబాబు నాయుడు చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయటంతో మహిళాభ్యున్నతికి మరింత అవకాశాలు లభిస్తాయన్నారు. చట్టసభల్లో మహిళలు ఉంటే మహిళా సమస్యలపై తమ వాణిని వినిపిస్తారని, తద్వారా సమస్యలు పరిష్కారవౌతాయని అన్నారు. మహిళలు పురుషులపై ఆధారపడకుండా ఆర్థిక స్వావలంబన సాధించాలని కోరారు. స్థానిక సంస్థల పదవుల్లో ఎక్కువ మంది మహిళలు ఉన్నప్పటికీ తమ భర్తలపై ఆధారపడుతూ సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని తెలిపారు. ఎంపిపి కళ్ళం వెంకటేశ్వరరెడ్డి, ఎంపిడిఓ ఈశ్వరపద్మసుధ, ఎంఇఓ కృష్ణదిలీప్, పిహెచ్‌సి డాక్టర్ మంజూష, ఐసిడిఎస్ సూపర్‌వైజర్ నాగమల్లేశ్వరి, పలువురు ఉపాధ్యాయినులు ప్రసంగించారు. ఈసందర్భంగా వివిధ రంగాల్లోని 20మంది మహిళలను లయన్స్ క్లబ్ తరపున శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి, మూడే శివశంకర్, చాంగటి సాంబిరెడ్డి, వెంకటేశ్వరరావు, వెలుగు ఏపిఎం సిహెచ్ మహంకాళిరావు, తదితరులు పాల్గొన్నారు.

శ్రీ సంగమేశ్వరాయంలో
స్వామిని తాకిన సూర్యకిరణాలు
నాగాయలంక, మార్చి 8: మండల పరిధిలోని సంగమేశ్వరం గ్రామంలో వేంచేసి వున్న శ్రీ గంగా, పార్వతీ సమేత సంగమేశ్వరస్వామి ఆలయంలో సూర్య కిరణాలు పడుతున్నాయి. సాధారణంగా మహాశివరాత్రికి వారం రోజుల తరువాత ఇలా కిరణాలు పడటం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంవత్సరం మహాశివరాత్రి మరుసటి రోజు నుంచే సూర్యకిరణాలు నేరుగా ఆలయంలో ప్రసరించటం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు పలు గ్రామాల ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఒరిస్సాలోని కోణార్కలో శ్రీ సూర్య దేవాలయంతో పాటు శ్రీ సంగమేశ్వరస్వామి ఆలయంలో స్వామివారిపై ఇలా సూర్య కిరణాలు ప్రసరించటం విశేషం.

వైభవంగా ఆదిదంపతుల కల్యాణం
జగ్గయ్యపేట రూరల్, మార్చి 8: కృష్ణవేణి నదీతీరాన ఉత్తర వాహినిగా విరాజిల్లుతున్న ముక్త్యాల గ్రామంలో శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని సోమవారం అర్ధరాత్రి స్వామివారి కల్యాణోత్సవాలను ఘనంగా నిర్వహించారు. వావిలాల లక్ష్మీనారాయణ, వారణాసి సాంబశివరావు, తూమాటి లక్ష్మీనర్శింహచార్యులు, మద్దిరాల ప్రేమకుమార్ శర్మ ఆధ్వర్యంలో 12గంటలకు స్వామివారి, అమ్మవారి ఉత్సవమూర్తులను వాహనంలపై కొలువుతీర్చి ఎదురుకోల ఉత్సవం నిర్వహించారు. అనంతరం వివిధ పరిమళ పుష్పాలతో అలంకరించిన ప్రత్యేక మండపంపై కల్యాణోత్సవాలను నిర్వహించారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు వెలగపూడి ఇందిరాదత్ కుటుంబ సభ్యులు దీపాలు వెలిగించి కల్యాణోత్సవాలను ప్రారంభించారు. పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తుల సమక్షంలో మూడు గంటల పాటు స్వామివారి కల్యాణం కమనీయంగా కొనసాగింది. 12.30 గంటలకు స్వామివారి లింగోద్భవ కాలంలో అన్నాభిషేకం నిర్వహించారు. ఆలయ మండపాలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో కూచిపూడి నాట్యం, జానపద డప్పుల నృత్యం, కోలాట ప్రదర్శనలు భక్తులను విశేషంగా అలరించాయి. తిరునాళ్లకు వచ్చిన భక్తులు స్వామివారి క్షేత్రంలో జాగారం చేసి మంగళవారం ఉదయం పవిత్ర కృష్ణానదిలో స్నానాలు ఆచరించారు. ప్రత్యేకాధికారి డి శ్రీరాంవరప్రసాదరావు, ఇఒ కొల్లా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు చేశారు. కోటిలింగాల క్షేత్రంలో శివపార్వతుల కల్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. ఈసందర్భంగా శివతాండవం గ్రంథాన్ని మాజీ మంత్రి నెట్టెం రఘురాం దాతలతో కలిసి ఆవిష్కరించారు. ఇఒ ధూళిపాళ సుబ్రమణ్యం, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బలుసుపాడు శ్రీగురుథామ్‌లో సద్గురు కందుకూరు శివానంద మూర్తి భక్తబృందం ఆధ్వర్యంలో శివకల్యాణాన్ని నిర్వహించారు. గెంటేల వెంకట రమణ, వసంత లక్ష్మి దంపతులు పాల్గొన్నారు.