తెలంగాణ

కొమురవెల్లి మల్లన్న.. సల్లంగా సూడన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట/ చేర్యాల, జనవరి 22: సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రమైన కొమురవెళ్లి మల్లన్న క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. మల్లన్న స్వామివారి జాతర ఆదివారంతో ప్రారంభం కావడంతో కొమురవెళ్లికి భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రాంగణమంతా జనసంద్రంగా మారింది.
సంక్రాంతి తర్వాత వచ్చే తొలి ఆదివారంతో జాతర ప్రారంభంకావడం ఆనవాయితీగా వస్తుంది. జాతరలో మొదటి ఆదివారాన్ని పట్నం వారంగా పిలుస్తారు. ఈ వారంలో హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి భక్తులు అధికంగా స్వామివారిని దర్శించుకోవడం వల్ల ఈ వారాన్ని పట్నం వారంగా పిలవడం జరుగుతుంది. శనివారం సాయంత్రానికే భక్తులు కొమురవెళ్లికి చేరుకొని ముందుగా స్వామివారిని దూళి దర్శనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం కల్యాణ కట్ట వద్ద తలనీలాలు సమర్పించి కోనేరులో స్నానం ఆచరించారు. అనంతరం గంగరేణి చెట్టు, ముఖ మంటపం వద్ద పంచరంగులతో పట్నాలు వేసి ఢమరుఖ నాదాల మద్య భక్తులు తమమొక్కులను చెల్లించుకున్నారు. గొల్లకేతమ్మ, బలిజ మేడలమ్మలతో కొలువైన కొమురవెళ్లి మల్లన్నను దర్శించుకొని తమ కుటుంబాలను సల్లంగా చూడాలని వేడుకున్నారు. ఆ తర్వాత భక్తులు తాము విడిది చేసిన ప్రాంతాల వద్ద బోనాలను తయారుచేసుకొని వాటిని నెత్తిన పెట్టుకొని నృత్యాలు చేస్తూ గుట్టపై కొలువైన ఎల్లమ్మ తల్లి సన్నిదికి చేరుకొని బోనాలను సమర్పించారు. అనంతరం అమ్మవారికి ఎంతో ప్రీతి పాత్రమైన కల్లును ఆరంగింపుగా చూపి తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. దేవాలయ గదులు అందుబాటులో లేకపోవడంతో భక్తులు డేరాలు వేసుకొని, చెట్ల కింద బస చేసి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. స్వామివారి సన్నిదికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని ప్రకటించినప్పటికి జాతరకు మల్లన్న దర్శనానికి వచ్చిన భక్తులు అవస్థలు ఎదుర్కోన్నారు. ఆలయ ఇవో రామకిషన్‌రావు, కమిటి చైర్మన్ బద్దిపడిగ క్రిష్ణారెడ్డిలు జాతర పురస్కరించుకొని చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా ముందు జాగ్రత్త చర్యగా సిద్దిపేట సిపి శివకుమార్, గజ్వెల్ ఎసిపి గిరిధర్ ఆధ్వర్యంలో చేర్యాల సిఐ చంద్రశేఖర్, ఎస్సైలు, పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

చిత్రం..బోనాలతో శివసత్తుల నృత్యాలు