తెలంగాణ

మేయర్లు, డిప్యూటీలు ఏకగ్రీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్, డిప్యూటీ మేయర్లుగా తెరాస కార్పొరేటర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తొలి గ్రేటర్ వరంగల్ మేయర్‌గా నన్నపనేని నరేందర్, డిప్యూటీ మేయర్‌గా మైనారిటీ వర్గానికి చెందిన ఖాజా సిరాజుద్దీన్ ఎన్నికయ్యారు. 58వార్డుల్లో 44చోట్ల తెరాస విజయం సాధించింది. 8మంది తెరాస రెబెల్స్ గెలిచారు. స్వతంత్ర అభ్యర్థులు తెరాసకు మద్దతిచ్చారు. ఇన్‌చార్జ్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు నిర్వహించారు. ఇక ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా గుగులోతు పాపాలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్‌గా బత్తుల మురళీ ప్రసాద్ ఎన్నికయ్యారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో ఎన్నిక జరిగింది. తనకు మేయర్ పదవి ఇవ్వాలని కోరుతూ 1వ డివిజన్ నుంచి గెలిచిన రామ్మూర్తి నాయక్ తెరాస పార్టీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. కార్పొరేషన్ కార్యాలయానికి కార్పొరేటర్లు వస్తున్న బస్సుకు అడ్డంగా నిలబడి నినాదాలు చేశారు. తెరాస కార్యకర్తలకు, నాయక్ అనుచరులకు మధ్య వాగ్వాదం జరగడంతో పోలీసులు జోక్యం చేసుకుని నాయక్‌ను అదుపులోకి తీసుకున్నారు. దాంతో అతను మేయర్ ఎన్నికకు హాజరుకాలేదు. మేయర్, డిప్యూటీ మేయర్‌ను మంత్రి, జిల్లా కలెక్టర్ అభినందించారు.

ఖమ్మం మేయర్

వరంగల్ మేయర్ నరేందర్