తెలంగాణ

ఎమ్మెల్యేపై తేనెటీగల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకొండ, జనవరి 30: నల్లగొండ జిల్లా దేవరకొండ డివిజన్ పరిధిలోని నేరెడుగొమ్ము మండలం కాసరాజ్‌పల్లి పరిధిలోని గాజుబేడ గుహలను పరిశీలించేందుకు సోమవారం వెళ్ళిన ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌పై తేనెటీగలు దాడి చేశాయి. ఈ సంఘటనలో ఎమ్మెల్యేతో సహా ఆయన గన్‌మెన్ సైదులు, టిఆర్ ఎస్ నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన చికిత్స నిమిత్తం దేవరకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. నేరెడుగొమ్ము మండలం కాసరాజ్‌పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఎత్తయన గుట్టలపై ఉన్న పురాతన గాజుబేడ గుహలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసేందుకు ఎమ్మెల్యే రవీంద్రకుమార్, పలువురు ప్రజాప్రతినిధులు, టిఆర్‌ఎస్ కార్యకర్తలతో కలిసి సోమవారం గుట్టపైకి ఎక్కారు. గుహలకు సమీపంలోకి వెళ్ళగానే మనుషుల అలికిడికి గుహలో ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా లేచి దాడి చేయడంతో భయకంపితులై ఎమ్మెల్యేతో సహా పలువురు టిఆర్‌ఎస్ కార్యకర్తలు, జర్నలిస్టులు గుట్ట కిందికి వేగంగా పరుగెత్తారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేపై తేనెటీగలు దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. చందంపేట ఎస్‌ఐ సతీష్‌కుమార్‌తో సహా పలువురు టిఆర్‌ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యేకు రక్షణగా నిలిచి ఆయనను చేతులపైకి ఎత్తుకొని ముఖంపై తేనెటీగలు దాడి చేయకుండా టవల్‌ను కప్పి గుట్ట కిందికి చేర్చారు. అప్పటికే తేనెటీగలు ఎమ్మెల్యేను, టిఆర్‌ఎస్ నాయకులను తీవ్రంగా కుట్టాయి. గుట్ట కిందికి ఎమ్మెల్యేను చేర్చిన అనంతరం పోలీస్ వాహనంలో ఎమ్మెల్యేను హుటాహుటిన చికిత్స నిమిత్తం దేవరకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దాడిలో గాయపడ్డ చందంపేట మాజీ ఎంపిపి లోకసాని తిరుపతయ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వైద్యులు అతనిని హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు.

చిత్రం.. గాయపడ్డ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌