తెలంగాణ

చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ సమంత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 31: సినీ నటి సమంత మంగళవారం ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావును బేగంపేటలోని మంత్రి నివాసంలో కలిసి, చేనేత ఉత్పత్తుల ప్రచారానికి తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. తెలంగాణ స్టేట్ వీవర్స్ కో ఆపరేటివ్ సొసైటీ(టెస్కొ)తో కలిసి చేనేతకు ప్రోత్సాహాన్ని అందించే కార్యక్రమాల్లో పాల్గొంటానని చెప్పారు. కరీంనగర్ చేనేత కార్మికులు రూపొందించిన చేనేత వస్త్రాలను కెటిఆర్ ఈ సందర్భంగా సమంతగా అందజేశారు. ప్రజల్లో చేనేత వస్త్రాల పట్ల మక్కువ పెరిగే విధంగా అవగాహన కల్పించటానికి తనకు కొన్ని ఆలోచనలు ఉన్నాయని సమంత తెలిపారు. గద్వాల, పోచంపల్లి చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ కోసం కొన్ని సూచనలు చేశారు. సిరిసిల్ల పవర్ లూమ్ నుంచి నాణ్యతగల చేనేత వస్త్రాలను రూపొందించడం గురించి అభిప్రాయాన్ని వెల్లడించారు. నూతన డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకుని మరింత అందంగా రూపొందించవచ్చునని చెప్పారు. చేనేతను తాను ఒక కళగా భావిస్తానని, సాధ్యమైనంత వరకు చేనేత వస్త్రాలు ధరిస్తానని సమంత తెలిపారు. మంత్రి ఇటీవల చేనేతపై ప్రచారం ప్రారంభించారు. వారానికి ఒక రోజు చేనేత వస్త్రాలు ధరించడమే కాకుండా తమ శాఖలో అధికారులు, ఉద్యోగులు ఇదే విధంగా ధరించాలని సూచించారు. కెటిఆర్ చేనేత ప్రచారంకు సమంత మద్దతు తెలిపారు.
చేనేత ప్రచారానికి సమంత ముందుకు రావడం పట్ల మంత్రి కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ చేనేత ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలని కెటిఆర్ సమంతను కోరారు. తెలంగాణ హ్యాండ్లూమ్ ప్రచారానికి సమంత సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోచంపల్లి చీరను కెటిఆర్ సమంతకు అందజేశారు.

చిత్రం..మంగళవారం హైదరాబాద్‌లో మంత్రి కెటిఆర్ తో సమావేశమైన సినీ నటి సమంత