తెలంగాణ

కాటికి చేర్చిన ‘కాన్వాయ్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జనవరి 31: కనికరించని ఖాకీల క్రూరత్వం... దారొదలని యమకింకరుల కిరాతకం... వెరసి ఓ వృద్ధురాలి ఆయుష్షు తీసింది. సిఎం కాన్వాయ్ బందోబస్తు నిండు ప్రాణాన్ని కాటికి చేర్చింది. భర్త ఆరాటం... భార్య పోరాటం... మానవత్వం ఎరుగని పోలీసుల ముందు మోకరిల్లింది...! సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంగళవారం ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటన సందర్భంగా ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. మృతురాలి భర్త, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్‌లో నివాసముంటున్న సోమ అంజయ్య సతీమణి సోమ లక్ష్మమ్మ (64) గత కొంతకాలంగా గుండె, ఆస్తమా వ్యాధితో బాధపడుతూ స్థానిక విద్యానగర్‌లో ఉన్న డాక్టర్ రాంమూర్తి వద్ద చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగాలేదని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని వైద్యుడు సోమవారం సూచించడంతో మంగళవారం ఆమెను హైదరాబాద్‌కు తీసుకెళ్లేందుకు ఇంటి వద్ద నుండి భర్త అంజయ్య కారులో వెళ్లేందుకు సిద్ధం కాగా అకస్మాత్తుగా ఆమె నోటి నుండి నురగలు వచ్చాయి. దీంతో ఆమెను విద్యానగర్‌లో ఉన్న డాక్టర్ రాంమూర్తి ఆసుపత్రికి కారులో తీసుకెళ్లేందుకు యత్నించగా అదే సమయంలో ఆసుపత్రి పక్కనే ఉన్న మంత్రి జగదీశ్‌రెడ్డి నివాసానికి ముఖ్యమంత్రి వస్తుండడంతో పోలీసులు తెలంగాణ తల్లి విగ్రహం వద్ద వారిని అడ్డుకున్నారు. దీంతో మరో దారిలో ఆసుపత్రి వెనుక రోడ్డు వరకు వెళ్లగా అక్కడ కూడా పోలీసులు అడ్డగించడంతో తానే ఆసుపత్రిలోకి వెళ్లి డాక్టర్‌కు విషయం చెప్పగా వాహనం వద్దకు డాక్టర్ వచ్చి పరీక్షించి స్టక్చర్‌పై ఆసుపత్రిలోకి తీసుకెళ్లి పరీక్షించి లక్ష్మమ్మ మృతి చెందిందని చెప్పినట్లు మృతురాలి భర్త అంజయ్య విలేఖరులకు తెలిపారు. తన భార్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పినా పోలీసులు అనుమతించలేదని ఆయన విలపిస్తూ చెప్పారు. ఈ విషయంపై ఆసుపత్రి డాక్టర్ వి. రాంమూర్తి మాట్లాడుతూ లక్ష్మమ్మ పరిస్థితి బాగులేదని, వాహనంలో ఉన్నట్లు తనకు చెప్పగానే కారు వద్దకు వెళ్లి పరీక్షించానని, అప్పటికే మృతిచెందినట్లుగా ఉందని అయినప్పటికీ ఆసుపత్రిలోకి తీసుకొచ్చి పూర్తిస్థాయిలో పరీక్షించిన తర్వాత మృతి చెందినట్లు నిర్ధారించామని తెలిపారు. ఈ విషయంపై ఎస్పీ పరిమళ హనానూతన్ మాట్లాడుతూ లక్ష్మమ్మను తీసుకెళ్లున్న వాహనాన్ని పోలీసులు ఎక్కడా అడ్డుకోలేదని వివరణ ఇచ్చారు. రోగి ఉన్నట్లు చెప్పిన వెంటనే వాహనాన్ని అనుమతించామన్నారు. లక్ష్మమ్మ మృతికి ముఖ్యమంత్రి పర్యటన బందోబస్తు కారణం కాదని పేర్కొన్నారు. ఈ విషయంలో పోలీసుల నిర్లక్ష్యం ఎంతమాత్రం లేదన్నారు. పోలీసులపై నిందారోపణలు చేయడం బాధాకరమన్నారు. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.