తెలంగాణ

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జనవరి 31: పంటల సాగు కోసం చేసిన అప్పులు తీర్చే దారి లేక మనస్తాపానికి గురై రైతు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సూర్యాపే జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం తుమ్మలపెన్‌పహాడ్ ఆవాసం మంగళితండాలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి మృతుని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన రైతు ధరావత్ హన్మంతు (47) తనకు ఉన్న రెండెకరాలతో పాటు మరో రెండెకరాల భూమిని కౌలుకు తీసుకొని శనగ, మిర్చి, వరిని సాగుచేస్తున్నాడు. నీటి కోసం గత ఆదివారం తన పొలంలో రెండు బోర్లు వేసినా నీళ్లు పడలేదు. అప్పటికే రూ.4 లక్షల అప్పులు ఉండడం, మరో లక్ష రూపాయలు అప్పు తెచ్చి సాగుచేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొనడంతో మనస్తాపం చెంది సోమవారం రాత్రి తన వ్యవసాయ బావి వద్ద క్రిమిసంహారక మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. పక్కన ఉన్న రైతులు గమనించి చికిత్స నిమిత్తం సూర్యాపేటకు తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.