తెలంగాణ

భాగ్యనగరానికి ఇక రోజూ నీళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 31:నగరంలోని పలు ప్రాంతాలకు వచ్చే వారం నుంచి ప్రతి రోజూ మంచినీటిని విడుదల చేయనున్నారు. తొలుత ఎంపిక చేసిన కొన్ని బస్తీల్లో రోజూ నీటిని విడుదల చేసి, అనంతరం దశలవారీగా నగరమంతటా రోజూ మంచినీటిని విడుదల చేయనున్నట్టు మున్సిపల్ వ్యవహారాల మంత్రి కెటిఆర్ తెలిపారు.ప్రయోగాత్మకంగా ప్రతి రోజూ నీటిని సరఫరా చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు అధికారులు తెలిపారు. సనత్‌నగర్ నియోజక వర్గంలోని పలు బస్తీల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం నీటి సరఫరాను ప్రారంభిస్తారు.
కాగా నగరంనుంచి శివార్ల వరకు చేపట్టే ఎక్స్‌ప్రెస్ హైవేలకు నిధులు సమకూర్చేందుకు వివిధ ఏజెన్సీలు సంసిద్థత వ్యక్తం చేశాయని, నిధుల సమస్య లేదని మంత్రి తెలిపారు. ఆయన మంగళవారం మున్సిపల్ శాఖపై సమీక్ష నిర్వహించారు. నాలాల పూడిక తీసివేత పనులు గతంలో మాదిరిగా ఏడాదికి ఒకసారి కాకుండా నిరంతరం ఆ పనులు చేయాలని నిర్ణయించారు. ఈ ఆర్థిక సంవత్సరం రావలసిన నిధులపై ఆర్థిక శాఖ అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్టు చెప్పారు. నగరంలోని నాలాల సర్వే వారం రోజుల్లో పూర్తి అవుతుందని అధికారులు మంత్రికి తెలిపారు. హెచ్‌ఎండిఏ మాస్టర్ ప్లాన్ పరిధిలో 848 గ్రామాలు, 71 మండలాలు, ఏడు జిల్లాలు, 12 మున్సిపాలిటీలు వస్తున్నాయని, అంతా కలిసి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని చెప్పారు. మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణ కోసం మూసీ అధారిటీని ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు.