తెలంగాణ

రక్షకభటుడే భక్షకుడైతే..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారాయణపేటటౌన్, జనవరి 31: కోర్టుకు హాజరయ్యేందుకు వచ్చిన వివాహితపై ఒక కానిస్టేబుల్ అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు. దీంతో బాధిత మహిళ నేరుగా ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్‌కు తన ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా తన వాంగ్మూలాన్ని చెప్పి కోర్టు బయట విలేఖరులకు ఈ ఘటనకు సంబందించిన వివరాలు వెల్లడించింది. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట కోర్టు ఆవరణలో చోటుచేసుకుంది. ఊట్కూరు మండల కేంద్రానికి చెందిన 28 ఏళ్ల వివాహితకు ధన్వాడ మండలం మందిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. భర్తతో మెంటెనెన్స్ కోసం ఎప్పటిలాగే కోర్టుకు మంగళవారం హాజరైంది. కోర్టుకు హాజరై కోర్టు మెట్లు దిగుతుండగా పరిసరాల్లో ఎవరూ లేని సమయాన్ని చూసుకుని ఊట్కూరు పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ కోర్టు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రామాంజనేయులు తనను ఒక్కసారిగా పక్కకు లాక్కెళ్లి అత్యాచారయత్నం చేశాడంటూ పత్రికల్లో రాయలేని భాషలో తెలిపింది. తన కోరిక తీర్చాలంటూ తన చెంపపై సైతం కొట్టాడని, తాను ఏడ్చినా వదలకపోవడంతో తాను కోర్టు ఆవరణలోనే గట్టిగా అరవడంతో తనను విడిచి కానిస్టేబుల్ పారిపోయాడని తెలిపింది. అయితే తనపై అత్యాచారయత్నం చేసిన రామాంజనేయులును కఠినంగా శిక్షించి తనకు న్యాయం చేయాలని వేడుకుంది.