తెలంగాణ

స్కూల్ బస్సు కింద పడి రెండేళ్ల చిన్నారి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాక్లూర్, జనవరి 31: డ్రైవర్ అజాగ్రత్త కారణంగా స్కూల్ బస్సు కింద పడి అభంశుభం తెలియని రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్యంపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ముత్యంపల్లికి చెందిన కుమార్, సావిత్రి దంపతులకు ఇద్దరు సంతానం. వీరు నివాసం ఉంటున్న ఇల్లు ప్రధాన రహదారికి ఆనుకుని పక్కనే ఉంటుంది. రెండేళ్ల వయస్సు గల విక్టరీపాల్ అనే బాలుడు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో ఇంటి బయట ఆడుకుంటూ ఆ సమయాల్లో వచ్చే స్కూల్ బస్సుల్లోని విద్యార్థులకు చేతులు ఊపుతూ టాటా చెప్పడం అలవాటుగా మారింది. రోజువారీ లాగే మంగళవారం ఉదయం కూడా సదరు బాలుడు ఇంటి బయట ఉండగా, అమ్రాద్‌లోని సరస్వతీ కిట్స్ పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు అదే సమయంలో వచ్చింది. విక్టరీపాల్ చిరునవ్వులు చిందిస్తూ స్కూల్ బస్‌లోని విద్యార్థులకు టాటా చెబుతుండగా, డ్రైవర్ ఆ బాలుడిని గమనించకుండానే బస్సును ముందుకు వెళ్లాడు. దీంతో బస్సు చక్రాల కింద పడి బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన బాధిత కుటుంబాన్ని శోకసంద్రంలో మునిగిపోయేలా చేయగా, గ్రామంలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. బాలుడిని ఏమాత్రం గమనించకుండా డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపడం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు పేర్కొన్నారు. బాలుడి తండ్రి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్కూల్ బస్సు డ్రైవర్ సాయిలును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి, కేసు దర్యాప్తు జరుపుతున్నామని ఎస్‌ఐ రామనాయుడు తెలిపారు.