తెలంగాణ

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి, జనవరి 31: వనపర్తి జిల్లా కేంద్రంలోని సివి రామన్ కళాశాల హాస్టల్‌లో ఉంటున్న ఇంటర్ ద్వితీయ సంవత్సరం బైపిసి విద్యార్థిని కీర్తిప్రియ (17) సోమవారం రాత్రి చున్నీతో ఉరి వేసుకొని మృతి చెందింది. వెంటనే చూసిన తోటి విద్యార్థులు అరవడంతో కళాశాల యాజమాన్యం ఆ విద్యార్థినిని అక్కడి నుండి ఓ ప్రయివేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించింది. పరిస్థితి విషమించిందని తెలుసుకున్న వైద్యులు విషయాన్ని కళాశాల యాజమాన్యానికి చెప్పడంతో అక్కడి నుండి వనపర్తి జిల్లా ఆసుపత్రికి ఆమెను తరలించారు. అయతే, అప్పటికే కీర్తిప్రియ మృతి చెందినట్లు ప్రభుత్వ డాక్టర్లు తెలిపారు. అనంతరం విషయాన్ని కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా కళాశాల యాజమాన్యం తెలిపింది. ఈ విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి చేరుకొని విచారించారు. తమ కూతురు ఆత్మహత్య చేసుకున్నదని తెలుసుకున్న తల్లిదండ్రులు సుజాత, చంద్రశేఖర్ గౌడ్ లబోదిబోమన్నారు. కేవలం రూ.5 వేలు ఫీజు చెల్లించలేదని ఇటీవలే కీర్తిప్రియ బ్యాగులను కళాశాల యాజమాన్యం తోటి విద్యార్థుల ముందే బయటికి విసిరి వేయడంతో మనస్తాపానికి గురైన తమ కుమార్తె ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చునని తల్లిదండ్రులు తెలిపారు. తన కూతురు మృతికి కారణమైన కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, పూర్తి స్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాలని వారు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ జి.చిన్నారెడ్డి హుటాహుటిన ఏరియా ఆసుపత్రికి వచ్చి చిన్నారిని చూసి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఎస్‌ఐని పిలిపించి, నిష్పక్షపాతంగా విచారణ జరిపి తగు చర్య తీసుకోవాలని ఆదేశించారు.