తెలంగాణ

ఎక్కా యాదగిరికి ఉస్మానియా శతాబ్ది పైలాన్ నిర్మాణ బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 2: ఉస్మానియా యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నెలకోల్పే పైలాన్ నిర్మాణ బాధ్యతలను ప్రసిద్ధ శిల్పకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎక్కా యాదగిరికి అప్పగించారు. గురువారం నాడు ఉస్మానియా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం ఎక్కా యాదగిరిని సత్కరించారు. ఈ సందర్భంగా పైలాన్ వ్యవహారం ప్రస్తావనకు వచ్చినపుడు పైలాన్ రూపకల్పనకు సహకరించగలనని యాదగిరి పేర్కొన్నారు. దీనిని ఉస్మానియా సెంటినరీ భవనం ముందు నెలకోల్పనున్నట్టు విసి ప్రొఫెసర్ రామచంద్రం తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సిహెచ్ గోపాల్‌రెడ్డి, ఒఎస్‌డి ప్రొఫెసర్ లింబాద్రి, ప్రొఫెసర్ జి బి రెడ్డి , స్పెషల్ ఆఫీసర్ ప్రొఫెసర్ హెచ్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కాగా యూనివర్శిటీ ఎస్సీ, ఎస్టీ టీచర్సు అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రొఫెసర్ టి కృష్ణారావు ఎన్నికయ్యారు. ప్రధానకార్యదర్శిగా ప్రొఫెసర్ ఎల్ బి లక్ష్మీకాంత్ రాథోడ్, ఉపాధ్యక్షులుగా ప్రొఫెసర్ నిర్మల బాబూరావు, డాక్టర్ జి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులుగా టి గంగాధర్, టి అపర్ణ, సంయుక్త కార్యదర్ళిగా డాక్టర్ శ్రీనునాయక్, కోశాధికారిగా ఎన్ రామ్‌ప్రసాద్ ఎన్నికయ్యారని రిటర్నింగ్ అధికారి ప్రొఫెసర్ నాయుడు అశోక్ తెలిపారు.