తెలంగాణ

ప్రైవేటీకరణపై పోరుకు సిద్ధం కండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, ఫిబ్రవరి 2: ‘ప్రపంచీకరణ... ప్రైవేటీకరణ... యాంత్రీకరణ విధానాలకు వ్యతిరేకంగా ప్రపంచ గని కార్మికులంతా సంఘటితంగా పోరాటాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఆసన్నమైంది. కార్మిక వర్గంపై పెట్టుబడిదారి వ్యవస్థ జరుపుతున్న ముప్పేట దాడిని తిప్పికొట్టాలి’ అని ప్రొఫెసర్ హరగోపాల్ పిలుపునిచ్చారు. ప్రపంచ గని కార్మికుల 2వ మహాసభ పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ప్రారంభమైన సందర్భంగా గురువారం రాత్రి ఇక్కడి జిఎం కాలనీ క్రీడామైదానంలో జరిగిన బహిరంగ సభలో ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ ప్రపంచంలో మొట్టమొదటి సభ పెరు దేశంలో జరుగగా పోరాటాల చరిత్ర గల భారత దేశంలో మొట్టమొదటి సారిగా ప్రపంచ గని కార్మికుల 2వ మహాసభ జరగడం నిజంగా హర్షించదగ్గ విషయమని అన్నారు. పెట్టుబడిదారి, అహంకార విధానాల వల్ల కార్మిక వర్గం నష్టపోతోందని అన్నారు. కార్మికుల సంఖ్యను తగ్గించేందుకే భూగర్భ గనులను మూసివేస్తూ ఓపెన్‌కాస్టు ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నారని, అయితే ఓపెన్‌కాస్టులతో పర్యావరణమంతా నాశనమవుతుందని అన్నారు.
అంతర్జాతీయ సమన్వయ బృందం ముఖ్య సమన్వయ కర్త అండ్రియాస్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బొగ్గు, బంగారం, వెండి, రాగి, ఇతర గనుల్లో పని చేస్తున్న కార్మికులు దోపిడీకి గురవుతున్నారని, శాశ్వత ఉద్యోగుల స్థానాల్లో కాంట్రాక్టు, క్యాజువల్, అవుట్ సోర్సింగ్ కార్మిక వ్యవస్థను పెంచుతున్నారని అన్నారు. ఉత్పత్తే ధ్యేయంగా ముందుకు పోతూ జర్మనీ దేశంలో అనేక గనులను మూసివేస్తున్నారని స్పష్టం చేశారు. ప్రస్తుతం పెట్టుబడిదారి వ్యవస్థల విధానాలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గమంతా ప్రమాద స్థితిలో ఉందని అన్నారు. ఐఎఫ్‌టియు జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ మాట్లాడుతూ నూతన ఆర్థిక, పారిశ్రామిక విధానాల అమలు తరువాత దేశ వ్యాప్తంగా ఉన్న 6లక్షల మంది కార్మికులు 3లక్షలకు తగ్గించబడ్డారని గుర్తు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా హక్కుల సాధన కోసం కార్మిక వర్గమంతా ఒకే వేదికపైకి రాకుండా ఉండేందుకు భారత ఎంబసి అధికారులు, కొన్ని దేశాల అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేశారని, లేకుంటే మరిన్ని దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యే అవకాశముండేదని చెప్పారు. ఈ సభలో విదేశీ ప్రతినిధులు మికివి డెమిట్రో, ఇవిగ్ని పొటపివ్, ఫాతిమహ్మద్, సోహిన్ బసరనర్, కమిల్‌తోపాటు భారత దేశ కార్మిక సంఘాల ప్రతినిధులు పికె.మూర్తి, బచన్ సింగ్, సోమ్‌నాథ్, సుదీప్, విఠల్ రాజ్, సంజయ్ సింగ్, గౌతమ్ మోడీ, వెంకటేశ్వర్ రావు, ఇ.నరేష్, టి.శ్రీనివాస్‌తోపాటు వేలాది మంది వివిధ దేశాల, రాష్ట్రాల గని కార్మికులు పాల్గొన్నారు.

చిత్రం..గురువారం రాత్రి గోదావరిఖనిలో ప్రపంచ గని కార్మికుల మహాసభలో మాట్లాడుతున్న ప్రొఫెసర్ హరగోపాల్