తెలంగాణ

50 ఏళ్ల వ్యక్తితో బాలికకు వివాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకొండ, ఫిబ్రవరి 2: గిరిజనులు అధికంగా ఉండే నల్లగొండ జిల్లా దేవరకొండ డివిజన్‌లో గురువారం మరో దారుణం వెలుగులోకి వచ్చింది. తొమ్మిదో తరగతి చదువుతున్న 14 సంవత్సరాల విద్యార్ధినిని 50 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తి వివాహం చేసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. అతనితో కాపురం చేయలేనని తనకు చదువుకోవాలని ఉందని సదరు బాలిక గృహ నిర్బంధం నుండి తప్పించుకొని బుధవారం సాయంత్రం పాఠశాలకు రావడంతో ఈ దారుణ విషయం వెలుగులోకి వచ్చింది. దేవరకొండ ఆర్డీవో లింగ్యానాయక్ కథనం మేరకు.. త్రిపురారం మండలం రాగడప గ్రామపంచాయతి పరిధిలోని మీట్యాతండాకు చెందిన ధనావత్ జీజా, ధన్‌కోటి దంపతుల రెండో కుమార్తె సరిత దేవరకొండ ప్రభుత్వ గిరిజనబాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో తొమ్మిదోతరగతి చదువుతోంది. దేవరకొండ మండలం కొండమల్లేపల్లిలో నివాసం ఉంటున్న బాలిక సోదరి ప్రోద్బలంతో బాలిక తల్లిదండ్రులు నాలుగు నెలల క్రితం నాంపల్లి మండలం రాజ్యాతండాకు చెందిన రమావత్ రవి (50) తో వివాహం జరిపించారు. రవి భార్య అనారోగ్యంతో గతంలోనే మరణించగా ఆయన కుమార్తె వివాహం కూడా జరిగింది. రవి ప్రస్తుతం కొండమల్లేపల్లి పట్టణంలో వెల్డింగ్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. రవి ఆర్ధికంగా స్ధితిమంతుడు కావడంతో కొండమల్లేపల్లిలో నివాసం ఉంటున్న బాలిక సవతితల్లి కూతురు రవితో వివాహం జరిపేంచేందుకు ఏర్పాట్లు చేసింది. దీంతో బాలికను నాలుగు నెలల క్రితం నాంపల్లి మండలంలోని ఓ దేవాలయంలో రాత్రి సమయంలో కుటుంబసభ్యులు బాలికకు రవితో వివాహం జరిపించారని ఆర్డీవో లింగ్యానాయక్ చెప్పారు. అయితే వివాహం జరిగిన తేదీ, వివాహం ఏ గుడిలో జరిగిందో బాలిక స్పష్టంగా చెప్పలేక పోతోంది. పెళ్ళి జరిగిన నాటి నుండి కొండమల్లేపల్లిలో నివాసం ఉంటున్న తన సోదరి సుజాత తనను గృహనిర్బంధంలో ఉంచిందని బాలిక వాంగ్మూలం ఇచ్చిందని ఆర్డీవో లింగ్యానాయక్ చెప్పారు. బాలిక వాంగ్మూలంతో పాటు బాలిక తల్లి జీజా, సోదరుడు నాగ వాంగ్మూలం కూడా తీసుకున్నామని విచారణ అనంతరం బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని ఆర్డీవో చెప్పారు.

చిత్రం..బాల్యవివాహం ఘటన వివరాలను వెల్లడిస్తున్న ఆర్డీవో లింగ్యానాయక్