తెలంగాణ

కేంద్రం నుంచి నిధులు సాధిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 3: రాష్ట్రంలో వివిధ అటవీ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి భారీగా నిధులు సాధిస్తామని అటవీ, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. త్వరలోనే ఒక బృందం ఢిల్లీ వెళుతుందని, నిధుల కోసం ప్రయత్నిస్తామని చెప్పారు. నేషనల్ మిషన్ ఫర్ ఏ గ్రీన్ ఇండియా, ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ వైల్డ్ హాబిటల్స్, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ప్రాజెక్ట్స్ నుంచి వీలైనంత మేరకు పెద్ద ఎత్తున నిధులను సాధించేందుకు ప్రణాళికతో వెళుతున్నట్టు చెప్పారు. బిసి సంక్షేమ పథకాలకు సైతం కేంద్రం నుంచి నిధులు సాధిస్తామని తెలిపారు.
పౌరసరఫరాల శాఖలో ఐటి విభాగం
ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రక్షాళన చేసేందుకు పౌర సరఫరా శాఖ చర్యలు చేపడుతోందని పాలనా పరంగా అన్ని అంశాలను పర్యవేక్షించేందుకు సాంకేతికను ఉపయోగించుకుంటున్నట్టు పౌర సరఫరాల కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. మండల స్థాయి నిల్వ కేంద్రాల వద్ద సిసి కెమెరాలు, సరుకులను తరలించేందుకు జిపిఎస్ , రేషన్ దుఖాణాల వద్ద బయో మెట్రిక్ విధానం వల్ల అక్రమాలను అరికట్టినట్టు చెప్పారు.