తెలంగాణ

పోలీసుల గుప్పిట్లో నేరస్థుల చిట్టా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 3: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేరగాళ్లు, తీవ్రవాద, ఉగ్రవాద అనుమానితుల కదలికలను పసిగట్టి, వారిని వెంటనే పట్టుకునేందుకు వీలుగా ఇంటిగ్రేటెడ్ పీపుల్ ఇన్ఫర్మేషన్ హబ్ (ఐపిఐహెచ్) డాటా బేస్‌ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర పోలీసు శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ తరహా డాటా బేస్‌ను హైదరాబాద్‌లో రూపొందించారు. ఈ డాటాబేస్‌లో ప్రజల పాస్‌పోర్టు, ఆధార్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సు వివరాలు, ప్రతి పౌరుడి పేరు, మారుపేర్లు, కుటుంబ వివరాలు, చిరునామాలు ఉంటాయి. దీని వల్ల నేరగాళ్ల వివరాలను సులువుగా తెలుసుకోవచ్చు. ప్రతి పౌరుడి గురించి సమగ్రమైన సమాచారం ఈ డాటాబేస్‌లో పొందుపరిచారు. దేశం మొత్తంలో రాష్ట్ర ప్రజలందరి డాటాబేస్‌ను రూపొందించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ప్రధానంగా ఈ డాటాబేస్‌లో గతంలో నేరాలు చేసి జైళ్లకు వెళ్లి విడుదలైన వారు, బెయిల్‌పై వచ్చిన నేరగాళ్లు, నేరప్రవృత్తి ఉన్న వ్యక్తులు, మిస్సింగ్ అయిన వ్యక్తుల వివరాలు ఉంటాయి. ఇంకా ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్), కేసు డైరీ వివరాలు పొందుపరిచారు. పన్నుల చెల్లింపులు, విద్యుత్ కనెక్షన్ నెంబర్, ఓటర్ ఐడి, ఈ-చలానాల వివరాలను నిక్షిప్తం చేశారు. ఇప్పుడు డాటాబేస్ వల్ల ఒకసారి నేరం చేసి పోలీసులకు దొరికిపోయిన వారి వివరాలు జీవిత కాలం పాటు పోలీసులకు అందుబాటులో ఉంటాయి. దేశ వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల పోలీసు శాఖలతో కూడా అవసరమైనప్పుడు ఈ సమాచారాన్ని పంచుకుని నేరగాళ్లను పట్టుకునేందుకు సహకరిస్తుంది.
ఆంధ్రలో డిఎన్‌ఏ డాటాబేస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేరగాళ్లను పట్టుకునేందుకు దేశంలో తొలిసారిగా డిఎన్‌ఏ డాటాబేస్‌ను రూపొందిస్తోంది. త్వరలో కేంద్రం డిన్‌ఏ డాటాబేస్‌పై చట్టాన్ని రూపొందించనుంది. ఏపి కూడా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో డిఎన్‌ఏ డాటాబేస్‌పై చట్టాన్ని రూపొందించే అవకాశం ఉంది. లాలాజలం, రక్తం శాంపిల్స్‌ను సేకరించి రెండు గంటల్లో అనుమానితులు నేరం చేశారా లేదా అనే విషయాన్ని రుజువు చేసేందుకు వీలుంది. కేంద్రం త్వరలో మానవ డిఎన్‌ఏ ప్రొఫైలింగ్ బిల్లును ఆమోదించిన వెంటనే డిఎన్‌ఏ డాటాబేస్ ల్యాబ్ ఏర్పాటుకు పోలీసు శాఖ చర్యలు తీసుకోనుంది.