తెలంగాణ

ప్రైవేటు ఆసుపత్రులపై కొరడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 3: ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిగే ఆపరేషన్ల వివరాలను తప్పనిసరిగా తెలియజేయాల్సిందేనని.. దీనికి సంబంధించిన ఆదేశాలను జారీ చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఆమలు పర్చని ప్రైవేటు ఆసుపత్రులపై కొరడా ఝుళిపిస్తామని హెచ్చరించారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఐసియు తరహాలో అన్ని సౌకర్యాలతో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రసూతి వార్డును మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ప్రభుత్వ వైద్య విధానాన్ని వైద్యవిధానంలో ఉన్నటువంటి పద్ధతులను భ్రష్టు పట్టించారని.. దాంతో ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందడంలో ఎన్నో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. వాటిని అధిగమించడానికి తెలంగాణ ప్రభుత్వం.. వైద్య విధానంలో ప్రక్షాళన ప్రారంభించిందన్నారు. జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో ఐసియులను ఏర్పాటు చేస్తున్నామని.. ముఖ్యంగా కాన్పుల వార్డులను ఐసియు తరహాలోనే ఆధునిక హంగులతో అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు శ్రీకారం చుట్టామని ఒక్కో అడుగు ముందుకు పడుతుందని చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో అవసరం లేకున్నా కొందరు డాక్టర్లు డబ్బే సంపాదనగా భావించి మహిళలకు గర్భాశయ ఆపరేషన్లు చేస్తున్నారని అందుకే ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రిలో జరిగే ప్రతి ఆపరేషన్ వివరాలను ప్రభుత్వానికి అందజేయాలనే నిబంధనాలను తీసుకువచ్చామన్నారు. మహిళలకు చిన్నతనంలోనే గర్భసంచులు తొలగిస్తే వారు ఎన్నో రోగాలకు గురయ్యే ప్రమాదం ఉంటుందని అనర్థాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. మహబూబ్‌నగర్ మెడికల్ ఆసుపత్రికి రూ.400కోట్ల నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. ఇందుకు 472 కొత్త పోస్టులు, మరో నాలుగేళ్లలో 519 కొత్త పోస్టులు రానున్నాయన్నారు. మెడికల్ కళాశాల అటానమస్ పరిధిలోకి తీసుకువచ్చామని తెలియజేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులు జరిగేలా విస్తృత ప్రచారం చేయడమేకాకుండా మహిళల్లో ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కలిగేలా అవగాహన చేపడుతామన్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యం ప్రజలకు అందాలనే దృక్పథంతో ముందుకు వెళ్తున్నారని తెలిపారు. నిమ్స్ తరహాలోనే మహబూబ్‌నగర్ జనరల్ ఆసుపత్రిలో కూడా అలాంటి అన్ని వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోబోతున్నామన్నారు. ఇటివల ఉస్మానియా ఆసుపత్రిలో ఆక్సిజన్ లేకనే ఆరుగురు చనిపోయారని పత్రికల్లో వచ్చిన వార్త బోగస్ వార్త అని అది నిజం కాదన్నారు. మీడియా, పత్రికలు ప్రభుత్వ ఆసుపత్రులపై వ్యతిరేకమైన వార్తలు ప్రచురిస్తే పేద ప్రజలకే ఎక్కువ నష్టం జరుగుతుందని ఇప్పుడిప్పుడే ప్రభుత్వ ఆసుపత్రులు గాడిన పడుతున్నాయని అందరు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రోనాల్డ్ రోస్, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.