తెలంగాణ

గృహ నిర్మాణానికి 769 కోట్ల కేంద్ర నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 3: గృహ నిర్మాణానికి కేంద్రం నుంచి రాష్ట్రం వాటాగా 767 కోట్ల రూపాయలు రానున్నాయని, మరిన్ని నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకు వస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి ఎన్ ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ పథకాల కింద రాష్ట్ర గృహ నిర్మాణ శాఖకు వచ్చే నిధులపై మంత్రి ఉన్నతాధికారులతో చర్చించారు. ప్రధానమంత్రి ఇందిరా ఆవాస్ యోజన పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే ఇళ్ల కోసం కేంద్రం బడ్జెట్‌లో 23వేల కోట్లు, పట్టణ ప్రాంతాల్లో నిర్మించే ఇళ్లకు 6043 కోట్లు మొత్తం 29,043 కోట్ల రూపాయలు కేటాయించారు. దీనిలో తెలంగాణ వాటా కింద గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే ఇళ్లకు 367 కోట్ల రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో నిర్మించే ఇళ్లకు 400 కోట్ల రూపాయలు మొత్తం 767 కోట్ల రూపాయల నిధులు తెలంగాణకు వస్తాయని చెప్పారు. దీనికి తగినట్టుగా ప్రతిపాదనలు రూపొందించాలని ఇంద్రకరణ్‌రెడ్డి శుక్రవారం జరిగిన సమావేశంలో తన శాఖ అధికారులను ఆదేశించారు. కేంద్ర పట్టణ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రులను కలిసి అదనపు నిధుల కోసం ఒత్తిడి తీసుకు రానున్నట్టు చెప్పారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి మంత్రులను కలువనున్నట్టు చెప్పారు. బీడీ కార్మికుల కోసం నిర్మించే ఇళ్లకు కూడా రాష్ట్రానికి అదనంగా నిధులు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయను కోరారు.
సమ్మక్క సారలమ్మ జాతరకు కేంద్ర నిధులు కోరతా
ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర అయిన సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ ప్రాధాన్యత గల ఉత్సవంగా భావించి నిధులు కేటాయించాలని కోరనున్నట్టు దేవాదాయ శాఖను కూడా నిర్వసిస్తున్న ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. అదే విధంగా ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ పరిధిలో ఉన్న ఆలయాల జీర్ణోద్ధరణ, అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరనున్నట్టు చెప్పారు. తమ శాఖకు కేంద్రం నుంచి ఏమైనా నిధులు రావాల్సి ఉందా? అనే అంశంపై మంత్రి దేవాదాయ శాఖ సెక్రటరీ శివశంకర్‌తో చర్చించారు. సమావేశంలో గృహ నిర్మాణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రా రామచంద్రన్, గృహ నిర్మాణ శాఖ సిఇ ఈశ్వరయ్య పాల్గొన్నారు.