తెలంగాణ

జూలై నాటికి పూర్తిచేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 3: మిడ్‌మానేరు ప్రాజెక్టు పనులను జూలై నాటికి పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, కల్వకుంట్ల తారక రామారావు ఆదేశించారు. ఇప్పటి వరకు 1375కోట్ల రూపాయలను పునరావాసం, భూ సేకరణ కోసం ఖర్చు చేశారు. మిడ్‌మానేరు ముంపు గ్రామాల్లో త్వరితగతిన పునరావాస ప్యాకేజీ అమలు చేయాలని అధికారులను వారు ఆదేశించారు. మిడ్ మానేరు ప్రాజెక్టు పనులు, భూ సేకరణ, పునరావాస పనులపై మంత్రులు టి హరీశ్‌రావు, కె తారక రామారావు శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి సోమవారం సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌తో ప్రాజెక్టుపైన సమీక్ష నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు 1375 కోట్ల రూపాయలు పునరావాసం, భూ సేకరణ కోసం ఖర్చు చేయగా, మరో వంద కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్టు చెప్పారు. నీటిపారుదల శాఖ, ఆర్ అండ్ బి రెవెన్యూ, జిల్లా స్థాయి అధికార యంత్రాంగ హాజరైన ఈ సమావేశంలో మిడ్ మానేరు పనులను వేగవంతం చేయాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. ప్రాజెక్టు పనులతో పాటు ముంపు ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పునరావాస ప్యాకేజీలు పూర్తి చేయాలని చెప్పారు. ముందుగా వర్షాకాలం రాగానే ముంపునకు గురయ్యే గ్రామాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపించాలని అన్నారు. ఈ మేరకు నిర్ణీత గడువులను పెట్టుకొని ఈ కార్యక్రమాలను పూర్తి చేయాలని చెప్పారు. అన్ని గ్రామాల్లో పర్యటించి క్షేత్ర స్థాయి పరిస్థితులకు అనుగుణంగా అధికారులు వ్యవహరించాలని అన్నారు. సిరిసిల్ల జిల్లాలోని నీటిపారుదల, ఆర్ అండ్ బి రెవెన్యూ భూ సేకరణ శాఖ, సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో కలిసి, ప్రత్యేకంగా బృందాలుగా ఏర్పాటు చేసుకొని పనులు పూర్తి చేయాలని చెప్పారు. ముంపు ప్రాంతాల్లో నిర్మాణాల అంచనాలు పూర్తి చేయాలని సూచించారు. మొదటి ప్రాధాన్యతగా గుర్తించిన చీర్ల వంచ, నీలోజు పల్లి, చింతల తానా వంటి గ్రామాల్లో పునరావాస పనులను ఫిబ్రవరిలోగా పూర్తి చేయాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. రెండవ ప్రాధాన్యతగా గుర్తించిన అణుపురం, శాబాష్‌పల్లి, సంకెపల్లి వంటి గ్రామాల్లో ఇళ్ల నష్టపరిహారం, పునరావాస ప్యాకేజీ వెంటనే అందే విధంగా చూడాలని కోరారు.